ఆక్సిజ‌న్ కొరత లేకుండా చూస్తాం

విధాత‌(విజయవాడ): జిల్లాలో ఆక్సిజన్ కొరత రాకుండా ప్రత్యేక మోనిటరింగ్ సెల్ ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. విజయవాడ జెసి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆక్సిజన్ సరఫరా, వినియోగం తదితర అంశాలపై సంబంధింత అధికారులతో సమీక్షించారు. అనంతరం విజయవాడలోని విన్ గ్యాస్ ఏజెన్సీ ఫిల్లింగ్ పాయింటును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మే 4,5 తేదీల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో […]

  • Publish Date - May 9, 2021 / 10:48 AM IST

విధాత‌(విజయవాడ): జిల్లాలో ఆక్సిజన్ కొరత రాకుండా ప్రత్యేక మోనిటరింగ్ సెల్ ద్వారా 24 గంటలు పర్యవేక్షణ చేస్తున్నామని జిల్లా కోవిడ్ నోడల్ ఆఫీసర్, జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తెలిపారు. విజయవాడ జెసి క్యాంపు కార్యాలయంలో శనివారం ఆక్సిజన్ సరఫరా, వినియోగం తదితర అంశాలపై సంబంధింత అధికారులతో సమీక్షించారు.

అనంతరం విజయవాడలోని విన్ గ్యాస్ ఏజెన్సీ ఫిల్లింగ్ పాయింటును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ మే 4,5 తేదీల్లో కోవిడ్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలో కొంత సమస్య తలెత్తిందని, అయితే సకాలంలో చర్యలు చేపట్టడం ద్వారా ఇబ్బందులు అధిగమించమన్నారు. మే 4న 36 మెట్రిక్ టన్నులు, మే 5న 86 , మే 6న 75, మే 7న 106 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ జిల్లా కు చేరిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి మే 4,5 తేదీల్లో రావాలిసిన ఆక్సిజన్ సాంకేతిక సమస్యలు వల్ల ఆగిపోతే జిల్లా కలెక్టర్ చొరవతో ప్రైవేటు ఆక్సిజన్కం పెనీ నుంచి 20 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసి ఆస్పత్రులకు సరఫరా చేశామన్నారు. ఇందుకు నగర సిపి బత్తిన శ్రీనివాసులు,ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సహకరిస్తున్నారన్నారు.

జిల్లాలో కోవిడ్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా విజయవాడలో సెంట్రలైజ్డ్ ఆక్సిజన్ యూనిట్ ను సిద్ధంగా ఉంచమన్నారు. ఆక్సిజన్ సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టించి నల్ల బజారు కు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని జేసీ శివశంకర్ హెచ్చరించారు.