Venu Swamy | మెగా డాటర్ నిహారిక‌ మళ్లీ పెళ్లి.. అందులోనూ?: వేణు స్వామి

Venu Swamy | ఫేమస్ కావాలంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఓ సంచలనం రేపే వీడియో పడేస్తే చాలు.. వ్యూస్, లైక్స్‌తో దెబ్బకు వైరల్ అవుతుంది. మ్యాటర్ ఉంటే ఇంకేముంది రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. ఒక్క సినిమా అనేకాదు, ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పేరుకి పేరు.. డబ్బు డబ్బు తెచ్చిపెడుతుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఈ మధ్య కాలంలో ఇలానే ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు. విషయంలోకి వెళితే.. వేణుస్వామి […]

  • By: krs    news    Jul 21, 2023 1:40 AM IST
Venu Swamy | మెగా డాటర్ నిహారిక‌ మళ్లీ పెళ్లి.. అందులోనూ?: వేణు స్వామి

Venu Swamy |

ఫేమస్ కావాలంటే ఈరోజుల్లో సోషల్ మీడియాలో ఓ సంచలనం రేపే వీడియో పడేస్తే చాలు.. వ్యూస్, లైక్స్‌తో దెబ్బకు వైరల్ అవుతుంది. మ్యాటర్ ఉంటే ఇంకేముంది రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవచ్చు. ఒక్క సినిమా అనేకాదు, ప్రతి ఒక్కరికీ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పేరుకి పేరు.. డబ్బు డబ్బు తెచ్చిపెడుతుంది. ఇక వ్యాపారస్తులు కూడా ఈ మధ్య కాలంలో ఇలానే ఫేమస్ కావడానికి సోషల్ మీడియాను ఎంచుకుంటున్నారు.

విషయంలోకి వెళితే.. వేణుస్వామి అదేనండీ ఫేమస్ జ్యోతిష్యుడు.. మామూలు జనాలతో పని అవదని, సెలబ్రెటీలు ముఖ్యంగా సినీ జనాలను టార్గెట్ చేసి వాళ్ళ జాతకాలను చెబుతూ ఫేమస్ అయిపోయాడు. ఇద్దరి ముగ్గురి విషయంలో ఈయన చెప్పింది నిజం కావడంతో ఇంకేముంది.. ఇప్పుడు సినీ హీరో, హీరోయిన్స్ అంతా ఆయన దగ్గరకు లైన్ కడుతున్నారు. తమ జాతకాల్లో ఉన్న దోషాలను తీసేయమని పూజలు కూడా చేయించుకుంటున్నారు.

మొన్నా మధ్య సమంత, నాగచైతన్య త్వరలో విడాకులు తీసుకుంటారని, విడిపోబోతున్నారని అన్నప్పుడు కాస్త నమ్మశక్యంగా లేదనుకున్నారు జనం. తీరా అది జరిగేటప్పటికి ఇంకేముంది అయ్యగారు పేరు మారుమోగిపోతుంది. గతంలోనూ చాలామంది సినిమావాళ్ళ జాతకాలు చెప్పిన వేణు స్వామి కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. కానీ ఒకటి రెండు జరిగేటప్పటికి సోషల్ మీడియాలో వేణు స్వామి వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే తాజాగా మెగా డాటర్ నాగబాబు కూతురు నిహారిక విషయంలోనూ వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైంది. నిహారిక, చైతన్య జొన్నలగడ్డలు త్వరలో విడిపోబోతున్నారని విడాకులు తీసుకుంటారనే విషయాన్ని ముందుగానే వేణుస్వామి సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

అప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. రీసెంట్‌గా వీళ్ళిద్దరూ విడిపోబోతున్నారని వార్తలు వస్తున్న నేపధ్యంలో.. ‘‘మేం ఇద్దరం కోర్టుద్వారా విడాకులు తీసుకున్నామని, దానికి మీరంతా సహకరించాలని’’ ఇద్దరూ సోషల్ మీడియాలో ప్రకటించడంతో ఇదేంటి ఇది ముందే వేణుస్వామి చెప్పాడు కదా అని అతను గతంలో చెప్పిన వీడియోలు ఇప్పుడు బయటకు తీస్తున్నారు నెటిజన్లు.

అయితే ఈ సందర్భంగానే నిహారిక జీవితంలో తను రెండో వివాహం చేసుకుంటుందని, దానిలో కూడా ఆమెకు కాస్త చికాకులు తప్పవని చెబుతున్నాడు వేణుస్వామి. నిహారిక పిల్లల విషయంగా కాస్త ఇబ్బందులు పడాల్సి వస్తుందని జాతకం చెప్పాడు వేణు స్వామి.

ఇక వేణు స్వామి వీడియోలు, అతను చెప్పే మాటలు అలా అలా సోషల్ మీడియా దాటి సెలబ్రెటీలు నమ్మే వరకూ వచ్చింది. అతని నోటి మాట జరుగుతుందనే ప్రచారం బాగానే సాగుతున్న తరుణంలో తారలు వేణు స్వామితో ప్రత్యేక పూజలు, వ్రతాలు, గ్రహ దోషాలకు సంబంధించి పూజలు చేయించుకుం టున్నారు. తాజాగా పుష్ప హీరోయిన్ రష్మిక, రామబాణం హీరోయిన్ డింపుల్ హయాతి, నిధి అగర్వాల్ వంటి వారు అతనితో పరిహార పూజలు చేయించుకున్నారు. ఈ వీడియోలు కూడా ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.