NAC Admission 2025: న్యాక్ పీజీ డిప్లోమా కోర్సుల నోటిఫికేషన్

NAC 2025–26 పీజీ డిప్లోమా నోటిఫికేషన్ విడుదలైంది. కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్ రంగాల్లో తక్కువ ఫీజుతో 100% ప్లేస్‌మెంట్ అవకాశాలతో ఉన్నత ప్రమాణాల శిక్షణ. BE/B.Tech/B.Arch విద్యార్థులకు అర్హత. వెబ్‌సైట్ www.nac.edu.in ద్వారా దరఖాస్తు చేసుకోండి.

NAC Admission 2025: న్యాక్ పీజీ డిప్లోమా కోర్సుల నోటిఫికేషన్

NAC Admission 2025 | విధాత : నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC)- 2025–26 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లోమా కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. కన్స్ట్రక్షన్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా, క్వాంటిటీ సర్వేయింగ్, కాంట్రాక్ట్స్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) 1998 సెప్టెంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పబ్లిక్ చారిటబుల్ ఇన్‌స్టిట్యూషన్ గా స్థాపించబడింది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) సహకారంతో ప్రారంభమైన NAC.. భారతదేశం, అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణ రంగ కార్మికులకు నైపుణ్యం కల్పించడంలో ముందంజలో ఉంది. వివిధ ఫ్లాగ్‌షిప్ ప్రోగ్రామ్‌లు ద్వారా శిక్షణ,అభివృద్ధి అవకాశాలను అందిస్తోంది.

పరిశ్రమకు అనుగుణమైన పాఠ్యక్రమం, వాస్తవ ప్రాజెక్టులు, సాంకేతికతల ఆధారంగాప్రాక్టికల్ సాఫ్ట్‌వేర్ శిక్షణ – MS Project, Primavera, Candy, BIM , ఖర్చు అంచనా టూల్స్ లో శిక్షణ అందిస్తుంది. 100% ప్లేస్‌మెంట్ అవకాశాలు కల్పిస్తుంది. న్యాక్ యొక్క విస్తృత నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా తక్కువ కోర్సు ఫీజులు, విద్య రుణ సౌకర్యం, హాస్టల్ సౌకర్యాలు, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా డిజిటల్ సర్టిఫికేషన్, లైవ్ సైట్ అనుభవంతో కోర్సులను అందిస్తుంది. జేఎన్‌టీయూహెచ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌ భాగస్వామ్యంతో న్యాక్ కోర్సులను నిర్వహిస్తుంది.

కోర్సులకు అర్హతగా B.E./B.Tech. (సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్) లేదా B.Arch. లేదా సమానమైన డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు (డిగ్రీ పొందిన తర్వాతే ప్రవేశం).

వివరాలకు ఈమెయిల్: pgcourses@nac.edu.in, మొబైల్: 9290021976, 9949060151, 9550881002, వెబ్‌సైట్: www.nac.edu.in, నమోదు విధానం ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా పొందవచ్చు.