Prabhas:ప్రభాస్‌కి ఎందుకిలా అవుతుంది.. సలార్ టీజర్‌పై మొదలైన నెగెటివిటీ..!
Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. రొమాంటిక్, మాస్ చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ప్రభాస్.. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి అనే చిత్రం చేయగా, ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడడంతో అన్నీ కూడా […]

Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తన కెరీర్‌లో వైవిధ్యమైన సినిమాలు చేశాడు. రొమాంటిక్, మాస్ చిత్రాలతో ప్రభాస్ ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్నాడు. అయితే ప్రభాస్.. రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి అనే చిత్రం చేయగా, ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కష్టపడ్డాడు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. ఇప్పుడు ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడడంతో అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. కాని బాహుబలి తర్వాత ప్రభాస్‌కి ఏ చిత్రం కలిసి రాలేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు తీవ్రంగా నిరాశపరిచాయి.
సలార్‌తో తప్పక అలరిస్తాడని అభిమానులు ఎంతో అనుకోగా, ఇప్పుడు తాజాగా విడుదలైన టీజర్‌పై నెగెటివిటీ మొదలు కావడంతో ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు. టీజర్ మాత్రం గూస్‌బంప్స్ తెచ్చేలా ఉంది. ప్రభాస్ యాక్షన్ సీన్ అదిరిపోగా, ఈ టీజర్ కొద్ది గంటల్లోనే ఏకంగా ఐదు మిలియన్స్ వ్యూస్‌ని సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా తప్పక హిట్ అవుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో ‘డిజప్పాయింట్’ అనే ట్యాగ్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ‘సలార్ డిజప్పాయింట్’ అంటూ టీజర్‌పై బాగా ట్రోల్స్ చేస్తున్నారు. టీజర్‌లో ప్రభాస్ పెద్దగా కనిపించకపోవడం వల్లనే ఇలా ఎక్కువ ట్రోల్ అవుతుందని మరి కొందరు అంటున్నారు.
మరి కొందరు సలార్ టీజర్ చూస్తే.. ఇది కేజీఎఫ్‌కి రీమేక్‌గా అనిపిస్తుందని అంటున్నారు. ఇంగ్లీష్ డైలాగ్, బ్లాక్ థీమ్, హీరో ఎంట్రీ, హీరో గురించి మరొకరు చెప్పడం, యాక్షన్ సీన్, బీజీఎం స్టయిల్, లొకేషన్ అన్నీ కూడా కేజీఎఫ్‌ని గుర్తు తెస్తున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా ఉసూరుమనిపించారేంటని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆదిపురుష్ మాదిరిగానే ఇప్పుడు సలార్ టీజర్ చాలా ట్రోల్స్ ఎదుర్కొంటుంది. ప్రభాస్ హేటర్స్ కావాలని ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్ అంటున్నారు. మరి దీనిపై టీం ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.