RTA కార్యాలయానికి డైరెక్టర్ రాజమౌళి!

విధాత: ప్రముఖ డైరక్టర్ రాజమౌళి ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేశ్ బాబు-రాజమౌళి సినిమాకు సంబంధించి విదేశాల్లో షూటింగ్ ఉన్న నేపథ్యంలో తన డ్రైవింగ్ లైసెన్సును రాజమౌళి రెన్యూవల్ చేసుకున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం రాజమౌళి సంతకం చేసి, ఫొటో దిగారు. అనంతరం అధికారులు ఆయనకు డ్రైవింగ్ లైసెన్స్‌ను అందజేశారు.
రాజమౌళి ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన సందర్భంగా అప్పటికే కార్యాలయం వద్ధ ఉన్న వారు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం రాజమౌళి మహేశ్ బాబు సినిమాతో బిజీగా ఉన్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఎస్ఎస్‌ఎంబీ మూవీ షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే ఒడిశాలో పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హిరోయిన్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ మూవీ షెడ్యూల్ విదేశాల్లో చిత్రీకరించబోతున్నారు. విదేశాల్లో షూటింగ్ కోసమే రాజమౌళి తన డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రయ పూర్తి చేసుకున్నారు.