తెలుగు రాష్ట్రాల సీఎంలు జోక్యం చేసుకోవాలి

విధాత‌(అమరావతి): ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మెరుగైన వైద్యం కోసం ప‌లువురు హైద‌రాబాద్‌కు వ‌స్తున్నార‌ని, ఇలాంటి వారి వాహ‌నాల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నార‌ని దీనిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ జోక్యం చేసుకోవాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాల‌ని ఆయ‌న కోరారు. ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి […]

  • Publish Date - May 10, 2021 / 09:36 AM IST

విధాత‌(అమరావతి): ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి మెరుగైన వైద్యం కోసం ప‌లువురు హైద‌రాబాద్‌కు వ‌స్తున్నార‌ని, ఇలాంటి వారి వాహ‌నాల‌ను తెలంగాణ స‌రిహ‌ద్దులో ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నార‌ని దీనిపై తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్‌, జ‌గ‌న్ జోక్యం చేసుకోవాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఏపీ నుంచి వ‌చ్చే అంబులెన్స్ లను పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాల‌ని ఆయ‌న కోరారు.

ఇదే అంశంపై బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి యస్.విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌త్వ‌రం చొర‌వ చూపాల‌ని ఆయ‌న కోరారు.