Miss World 2025: మిస్ వరల్డ్ (అందాల పోటీ) తేదీలు, వేదికలు పూర్తి షెడ్యూల్ ఇదే!

హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా 140 దేశాల నుంచి అందాల రాణులు పాల్గొనే మిస్ వరల్డ్ 2025 పోటీలు ఈ ఏడాది తెలంగాణలో ఘనంగా జరగనున్నాయి. మే 6, 7 తేదీల్లో పోటీదారులు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగనున్నారు. మే 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలేతో ఈ అందాల పోటీలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే వేదికగా ఈ మిస్ వరల్డ్ 2025 పోటీలు నిలిచే విధంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మిస్ వరల్డ్ 2025 షెడ్యూల్
మే 10: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ సాంప్రదాయ జానపద, గిరిజన నృత్యాలతో ఓపెనింగ్ సెరిమనీ
మే 12, 13: పోటీదారులు నాగార్జున సాగర్‌లోని బుద్ధవనం బౌద్ధ థీమ్ పార్క్ సందర్శణ, హైదరాబాద్ హెరిటేజ్ వాక్
మే 13: చౌమహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు
మే 14: కాకతీయ హెరిటేజ్ టూర్‌లో భాగంగా యునెస్కో హెరిటేజ్ సైట్ రామప్ప ఆలయ సందర్శణ
అదే రోజు వరంగల్ కాళోజీ క్షేత్రంలో పాఠశాల విద్యార్థులు, స్థానిక సముదాయాలతో సంభాషణ.
మే 15: యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించి, పోచంపల్లిలో చేనేత పర్యటనలో పాల్గొంటారు.
మే 16: హైదరాబాద్‌లోని AIG, అపోలో, యశోద ఆసుపత్రులకు వైద్య పర్యటన జరుగుతుంది.
మే 17: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ ఫినాలే.
అదే రోజు ఎక్స్‌పీరియం ఎకో టూరిజం పార్క్‌లో తెలంగాణ వంటకాల ఫుడ్ ఫెస్టివల్, సాంస్కృతిక కార్యక్రమం
మే 19: రాష్ట్ర సెక్రటేరియట్ గ్రౌండ్స్, ట్యాంక్ బండ్, అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల సందర్శణ
మే 20, 21: T-హబ్‌లో కాంటినెంటల్ ఫినాలే . కాంటినెంటల్ క్లస్టర్‌ల ఆధారంగా పోటీదారుల ఎంపిక.
మే 21: శిల్పారామంలో కళలు, చేతివృత్తుల సెషన్‌లో పాల్గొంటారు.
భారత్ నుంచి పోటీదారు
రాజస్థాన్ కోటాకు చెందిన నందిని శర్మ, 72వ మిస్ వరల్డ్ బ్యూటీ పేజెంట్‌లో భారత్‌ను ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 మిస్ వరల్డ్ విజేత క్రిస్టీనా పిస్కోవా, మే 7 నుంచి మే 31 వరకు జరిగే ఈ పోటీల ఫైనల్ రౌండ్‌లో విజేతకు కిరీటం అందజేస్తారు.
మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే తేదీ, వేదిక
మే 22: శిల్పకళా వేదికలో మిస్ వరల్డ్ టాలెంట్ ఫినాలే జరుగుతుంది.
మే 23: ISBలో హెడ్-టు-హెడ్ కాంపిటీషన్ ఫినాల్ నిర్వహిస్తారు.
మే 24: హైటెక్స్‌లో మిస్ వరల్డ్ టాప్ మోడల్ అండ్ ఫ్యాషన్ ఫినాలే జరుగుతుంది.
మే 25: హైటెక్స్‌లో జ్యువెలరీ, పెర్ల్ డిస్‌ప్లే ఈవెంట్ జరుగుతుంది.
మే 26: బ్రిటిష్ రెసిడెన్సీ/తాజ్ ఫలక్‌నుమాలో గొప్ప విందు ఏర్పాటు చేస్తారు.
మే 31: హైటెక్స్‌లో మిస్ వరల్డ్ ఫైనల్ సెరిమనీలు, ఈవెంట్‌లు జరుగుతాయి.
జూన్ 2: మిస్ వరల్డ్ విజేత గవర్నర్, ముఖ్యమంత్రిని కలుస్తారు.