Hyderabad: భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి చంపి, పూడ్చి పెట్టిన భార్య

Hyderabad: విధాత: వివాహేతర సంబంధాలు, అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఓ భార్య తన భర్తకు కరెంట్ షాక్ పెట్టి చంపి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన ఘటన వెలుగు చూసింది. హైదరాబార్ కేపీహెచ్ బీ కాలనలో ఈ దారుణం చోటుచేసుకుంది. సాయిలు, కవిత దంపతులు ఇద్ధరికి వివాహేతర సంబంధాల నేపథ్యంలో కొన్నాళ్ల నుంచి వేరువేరుగా ఉంటున్నారు. తరచు తన వద్ధకు సాయిలు వచ్చి వేధిస్తుండటంతో విసిగిపోయిన కవిత భర్తను వదిలించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు చెల్లెలు, ఆమె భర్త సాయం తీసుకుంది. ముగ్గురూ కలిసి ప్లాన్ చేసి సాయిలును కరెంట్ షాక్ తో చంపేశారు.
ఆపై గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని పాతిపెట్టి కవిత సొంతూరుకు వెళ్లిపోయింది. గ్రామానికి పని కోసం వెళ్లిన సాయిలు కొన్ని రోజుల నుంచి తిరిగి రాలేదని కవిత అందరిని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత సాయిలు కనిపించడం లేదంటూ పాతలింగయ్యపల్లి సర్పంచ్‌కు కవిత ఫోన్ చేసి చెప్పింది. సాయిలు బంధువులకు కవితపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డ హత్యోదంతం బయట పడింది. కేపీహెచ్‌బీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కవితతో పాటు ఆమె చెల్లెలిని, చెల్లెలు భర్తను అరెస్టు చేసి విచారిస్తున్నారు.