కేసీఆర్ ను కలిసి కుమారుడితో అమెరికాకు కవిత ప్రయాణం

కుమారుడి చదువు కోసం అమెరికా వెళ్తున్న కవిత, ప్రయాణానికి ముందు తండ్రి కేసీఆర్ ను ఫామ్ హౌస్ లో కలిసి ఆశీర్వాదం పొందారు.

కేసీఆర్ ను కలిసి కుమారుడితో అమెరికాకు కవిత ప్రయాణం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ ను కలిసేందుకు ఎర్రెవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. తన చిన్న కుమారుడు ఆర్యను అమెరికాలో గ్రాడ్యుయేషన్ కోర్సులో చేర్పించేందుకు కవిత 15రోజుల పాటు అమెరికా వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో కొడుకు ఆర్యకు తాత కేసీఆర్ ఆశీర్వాదం తీసుకునేందుకు ఆమె ఫామ్ హౌస్ కు వెళ్లినట్లుగా తెలుస్తుంది.

కొంత కాలంగా బీఆర్ఎస్ కు, అన్న కేటీఆర్ కు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న కవిత తాజాగా కేసీఆర్ ను కలవనుండటం ఆసక్తికరంగా మారింది. శనివారం అమెరికా వెళ్తున్న కవిత తిరిగి సెప్టెంబర్ 1న స్వదేశానికి తిరిగి రానున్నారు.

ఇవి కూడా చదవండి…

మనుషులకంటే మేమేం తక్కువా?..రోబోలకు ఒలంపిక్స్ పోటీలు

హైదరాబాద్ లో వెలుగులోకి లవ్ జిహాద్