కేసీఆర్ కలిసిన మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి(Suryapet MLA Jagadish Reddy) తన జన్మదినం సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR) కు కుటుంబసమేతంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి..కుటుంబసభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. పార్టీకి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) సేవలను ప్రశంసిస్తూ..తాజాగా ఆయన కన్నెపల్లి పంప్ హౌజ్(Kannepalli Pump House) మోటార్లను ఆన్ చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చేసిన పలు కార్యక్రమాలను కేసీఆర్ అభినందించారు. జగదీష్ రెడ్డి వెంట ఆయన సతీమణి సునీతారెడ్డి, కుమారుడు వేమన్ రెడ్డి, కుమార్తె లహరి రెడ్డి ప్రభృతులు ఉన్నారు.