నామినేటెడ్ పదవుల పేరుతో హడావుడి సిగ్గుచేటు
నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీల్లేని ఛైర్మన్లు సామాజిక న్యాయమా.?-కె.ఎస్.జవహర్ విధాత:రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పేరుతో చేస్తున్న హడావుడి నవ్వుతెప్పిస్తోంది. దాదాపు 26కీలక సంస్థలకు ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గ నేతల్ని నియమించి పల్లకీలో ఊరేగిస్తూ.. అప్రధాన్యత కలిగిన పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా.? టీటీడీ ఛైర్మన్ పదవిని మళ్లీ బాబాయికే కేటాయించడం బీసీ, ఎస్సీ,ఎస్టీలను ఉద్దరించడమా.? బడుగులు టీటీడీ ఛైర్మన్ పదవికి పనికిరారా జగన్ రెడ్డీ.? నిధులు లేని కార్పొరేషన్లు..కుర్చీల్లేని ఛైర్మన్ల నియామకంతో […]

నిధులు లేని కార్పొరేషన్లు.. కుర్చీల్లేని ఛైర్మన్లు సామాజిక న్యాయమా.?-కె.ఎస్.జవహర్
విధాత:రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పదవుల పేరుతో చేస్తున్న హడావుడి నవ్వుతెప్పిస్తోంది. దాదాపు 26కీలక సంస్థలకు ఛైర్మన్లుగా సొంత సామాజికవర్గ నేతల్ని నియమించి పల్లకీలో ఊరేగిస్తూ.. అప్రధాన్యత కలిగిన పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టడమే సామాజిక న్యాయమా.? టీటీడీ ఛైర్మన్ పదవిని మళ్లీ బాబాయికే కేటాయించడం బీసీ, ఎస్సీ,ఎస్టీలను ఉద్దరించడమా.? బడుగులు టీటీడీ ఛైర్మన్ పదవికి పనికిరారా జగన్ రెడ్డీ.? నిధులు లేని కార్పొరేషన్లు..కుర్చీల్లేని ఛైర్మన్ల నియామకంతో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. గతంలో ప్రకటించిన కార్పొరేషన్ కార్యాలయాల అడ్రస్ లు ఇంత వరకు తెలియదు.ఇప్పుడు ప్రకటించే పదవుల కార్యాలయాల అడ్రస్ చెప్పి..తర్వాత ఛైర్మన్లను నియమించాలి. నిధులు, విధులు లేని ఛైర్మన్ల నియామకంతో వారిని ఉత్సవ విగ్రహాల్లా తయారు చేస్తున్నారు.
గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారిని, సీట్లు దక్కలేదని అసంతృప్తితో ఉన్నవారిని సంతృప్తి పరచడం కోసమే తప్ప..బడుగుల బతుకులు మార్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా లేదు. రాజకీయ నిరుద్యోగుల్ని సంతృప్తి పరచి.. ప్రజలకు భారంగా మార్చడమే తప్ప చేసిందేమీ లేదు. బడుగు బలహీన వర్గాలకు పదవుల కేటాయింపు.. అసంతృప్తుల్ని కూల్ చేయడం కోసం మాత్రమే. ఏపీఐఐసీ, టీటీడీ వంటి పదవులకు బడుగు బలహీన వర్గాలకు అర్హత లేదా.? కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. సబ్ ప్లాన్ అస్తవ్యస్తం చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మూడున్నర కోట్ల మందిని వంచించి.. 135 పదవులు కేటాయించడం అండగా నిలవడమో.. నిండా ముంచేయడమో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.
కె.ఎస్.జవహర్
(మాజీ మంత్రివర్యులు)