జాబ్ క్యాలెండ‌ర్ ఒక జాదూ క్యాలెండ‌ర్‌

విధాత :ఫ్యాన్‌కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న జగన్ రెడ్డి… అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలెండర్ విడుదల చేశారని మండిపడ్డారు. బైబై బాబు అనే నినాదంతో చంద్రబాబుని ఓడించామనుకుని రాష్ట్రాన్ని ఓడించారన్నారు. పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని తెలిపారు.2.30లక్షల ఉద్యోగాలకు బదులు 10 వేలిచ్చి పండుగ చేసుకోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మెడలు వంచైనా 2.30లక్షల ఉద్యోగాలు […]

జాబ్ క్యాలెండ‌ర్ ఒక జాదూ క్యాలెండ‌ర్‌

విధాత :ఫ్యాన్‌కి ఓటేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తానన్న జగన్ రెడ్డి… అదే ఫ్యాన్‌కు నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి కల్పించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ వ్యాఖ్యానించారు.జాబ్ క్యాలెండర్ పేరిట జాదూ క్యాలెండర్ విడుదల చేశారని మండిపడ్డారు. బైబై బాబు అనే నినాదంతో చంద్రబాబుని ఓడించామనుకుని రాష్ట్రాన్ని ఓడించారన్నారు. పరిశ్రమలన్నీ బైబై ఆంధ్రప్రదేశ్ అంటున్నాయని తెలిపారు.2.30లక్షల ఉద్యోగాలకు బదులు 10 వేలిచ్చి పండుగ చేసుకోమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మెడలు వంచైనా 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా పోరాడతామని లోకేష్ స్పష్టంచేశారు.

గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో నిరుద్యోగ యువతతో లోకేష్ సమావేశమయ్యారు.నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణపై చర్చ నిర్వహించారు.