వండర్ .. భవిష్యత్తులో మొక్కలతోనే విద్యుత్ వెలుగులు!

చీకట్లో తానే వెలిగే మొక్కలు భవిష్యత్తులో విద్యుత్‌కు ప్రత్యామ్నాయమా? చైనా శాస్త్రవేత్తల సంచలన పరిశోధన ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

వండర్ .. భవిష్యత్తులో మొక్కలతోనే విద్యుత్ వెలుగులు!

విధాత : విద్యుత్తు ఉత్పాదన ప్రస్తుతం బొగ్గు..నీరు, గాలి, సౌర శక్తిలతో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే భవిష్యత్తులో వాటికి బదులుగా మొక్కలతోనే విద్యుత్తు ఉత్పత్తి జరుగనుందన్న విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రకృతిలో మిణుగురు పురుగులు, కొన్ని రకాల శిలీంద్రాలు చీకట్లో మెరుస్తుండటం ఇప్పటిదాక చూశాం.
రాత్రిళ్లు విద్యుత్తు అవసరం లేకుండా ఈ మొక్కలు నాటితే విద్యుత్ వెలుగులు పొందవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వినడానికి ఇది వింతగా ఉన్నప్పటికి చీకట్లో తానే వెలిగే మొక్కలను చైనా అగ్రీకల్చర్ యూనివర్సిటీ( China Agricultural University) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయడం ఆసక్తి రేపుతుంది.

చైనా శాస్త్రవేత్తల విద్యుత్త మొక్కల సృష్టి విజయవంతమైతే.. పర్యావరణ హితమైన జీవనశైలిలో మైలురాయిగా నిలవనుంది. మన వీధులు, ఇండ్లు విద్యుత్ దీపాలతో కాకుండా.. మెరిసే చెట్లతో కాంతి వంతంగా మారిపోనున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా విద్యుత్ ఉత్పదన, సరఫరాల సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరకడమే కాకుండా..భూమి మళ్లీ పచ్చదనంతో కళకళలాడవచ్చుంటున్నారు.

సహజ సిద్దంగా వెలిగే మొక్కల సృష్టి

విద్యుత్‌, వైర్లు, బ్యాటరీలు అవసరం లేకుండా ప్రకృతి సిద్దంగా రాత్రివేళ వెలిగే ఈ బయోల్యూమినిసెంట్ మొక్కలు భవిష్యత్తులో వీధి దీపాలకే ప్రత్యామ్నాయంగా మారనున్నాయంటున్నారు. సాధారణ మొక్కల్లాగే వీటికి నీరు, సూర్యరశ్మి, ఎరువులు అందిస్తే సరిపోతుందట. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఇవి శక్తిని పొందుతూ, రాత్రి వేళలో వెలుగును ప్రసరిస్తాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఈ మొక్కలు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ (CO2) ను పీల్చుకుంటూ ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయి. అంటే ఒకే సమయంలో ఇటు వెలుగును, అటు స్వచ్ఛమైన గాలిని కూడా అందిస్తాయని చెబుతున్నారు.

విజయవంతంగా పరిశోధనలు

చైనా అగ్రికల్చరల్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ లి రెన్హాన్ బృందం, మిణుగురు పురుగుల్లో ఉండే ‘ల్యూసిఫెరేస్’ ఎంజైమ్, శిలీంధ్రాలలోని కాంతినిచ్చే జన్యువులను సేకరించారు. ఈ జన్యువులను ఆర్కిడ్లు, పొద్దుతిరుగుడు, చామంతి వంటి సుమారు 20 రకాల మొక్కల కణాల్లోకి ప్రవేశపెట్టారు. దీనివల్ల ఆ మొక్కల కణాలు సహజంగానే కాంతిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం చైనా శాస్త్రవేత్తలు కేవలం ఆకుపచ్చ రంగులోనే కాకుండా, ఎరుపు, నీలం వైలెట్ రంగుల్లో వెలిగే మొక్కలను కూడా అభివృద్ధి చేశారు. కొన్ని మొక్కల్లోకి ఫాస్ఫర్ కణాలను ఇంజెక్ట్ చేయడం ద్వారా సూర్యరశ్మిని నిల్వ చేసుకొని రాత్రిపూట వెలిగేలా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మొక్కుల కాంతి కాస్త తక్కువగా ఉంటుందని, ఒక పుస్తకాన్ని చదవడానికి లేదా స్పష్టంగా వస్తువులను చూడటానికి సరిపోయేంత కాంతిని ఉత్పత్తి చేసే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయిని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ప్రత్యామ్నాయ విద్యుత్తుగా విప్లవాత్మక మార్పులు

విద్యుత్తు మొక్కల ప్రయోగం విజయవంతమై ఆచరణలోకి వస్తే..భవిష్యత్తులో పార్కులు, తోటలు, వీధుల వెంట ఈ మొక్కలను నాటడం ద్వారా విద్యుత్ దీపాల వినియోగం తగ్గవచ్చు. ఒక్కో మొక్కను తయారు చేయడానికి కేవలం 1.4డాలర్లు (సుమారు రూ. 120) మాత్రమే ఖర్చవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో ప్రభుత్వాలకు విద్యుత్ తయారీ, సరఫరా వ్యవస్థల కోసం చేస్తున్న ఖర్చును కూడా తప్పించవచ్చంటున్నారు.

ఇవి కూడా చదవండి :

Tanikella Bharani | ఆ న‌టుడికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నాను .. తనికెళ్ళ భరణి కామెంట్స్ వెనుక కార‌ణం ఏంటంటే..!
Pandav Falls tiger| పాండవ జలపాతంలో పెద్దపులి !