Samsung Airdrop | స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్‌న్యూస్! ఆండ్రాయిడ్ నుంచి ఐఫోన్లకు ఫైల్స్‌ను ఇకపై చాలా ఈజీగా పంపించవచ్చు. దీని కోసం ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన లేటెస్ట్ Samsung Galaxy S26 సిరీస్ మొబైల్‌లో Airdrop తరహా కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి థర్డ్ పార్టీ యాప్‌లపై ఆధారపడకుండానే శాంసంగ్ యూజర్లు తమ ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు ఇతర ఫైళ్లను ఈజీగా ఐఫోన్లకు పంపించవచ్చు.
ఇప్పటివరకు ఆండ్రాయిడ్ మొబైళ్ల నుంచి ఐఫోన్లకు ఫైళ్లు పంపించాలంటే థర్డ్ పార్టీ యాప్స్ లేదా క్లౌడ్ సేవలను ఉపయోగించాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్‌లో ఈ ఎయిర్‌డ్రాప్ తరహా Quick Share అప్‌డేట్ తీసుకొచ్చింది. దీన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని శాంసంగ్ కంపెనీ కొత్త ఫీచర్‌ను విస్తరించింది. ఈ ఫీచర్‌తో ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్ల వంటి ఫైళ్లను నేరుగా యాపిల్ డివైజ్‌ల (ఐఫోన్లు, ఐప్యాడ్, మ్యాక్)కు షేర్ చేసుకోవచ్చు.
దక్షిణ కొరియాలో అందుబాటులోకి!
ఈ ఫీచర్ రోల్ అవుట్ మార్చి 23వ తేదీ నుంచి ప్రారంభించినట్లు శాంసంగ్ కంపెనీ ప్రకటించింది. ప్రారంభంలో ఇది దక్షిణ కొరియాలో మాత్రమే అందుబాటులో ఉంది. ఆ తర్వాత వారాల్లో ఉత్తర అమెరికా, యూరప్, జపాన్, ఆగ్నేయాసియాతో సహా మరికొన్ని దేశాల్లో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గెలక్సీ S26 సిరీస్‌కు మాత్రమే పరిమితమైనప్పటికీ.. భవిష్యత్తులో ఇతర శాంసంగ్ ఫోన్లలో కూడా అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
ఎలా ఉపయోగించాలి?
ఈ ఫీచర్ ఆటోమేటిక్‌గా ఆన్ కాకపోవడంతో యూజర్లు మ్యాన్యువల్‌గా ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా Samsung Galaxy S26 మొబైల్‌లో
* ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* సెట్టింగ్స్‌లో క్విక్ షేర్ ఆప్షన్ ఎంచుకోవాలి
* ఆ తర్వాత Share with Apple devices ఆన్ చేయాలి
* అనంతరం విజిబిలిటీని Everyone for 10 minutesగా సెట్ చేయాలి.
* ఆ తర్వాత ఐఫోన్‌లో Airdrop ఆన్ చేయాలి. అందులోనూ విజిబిలిటీని Everyone for 10 minutesగా సెట్ చేయాలి.
* ఇప్పుడు ఫైల్‌ను పంపించడానికి గెలాక్సీ ఫోన్‌లో ఫైల్ ఓపెన్ చేసి.. క్విక్ షేర్‌పై ట్యాప్ చేయాలి. లిస్ట్‌లో కనిపించే ఐఫోన్‌ను సెలక్ట్ చేయాలి. అనంతరం ఐఫోన్‌లోనూ ఫైల్‌ను Accept చేయాలి.
డేటా ట్రాన్స్‌ఫర్ పూర్తిగా సేఫ్!
ఇలా ఆండ్రాయిడ్ మొబైల్ నుంచి ఐఫోన్‌లోకి డేటా పంపించినప్పుడు డేటా థర్డ్ పార్టీకి వెళ్తుందనే భయం ఉంటుంది. అయితే ఈ ఫైల్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ పూర్తిగా సురక్షితమైనది శాంసంగ్ కంపెనీ తెలిపింది. ఫైళ్లు డైరెక్ట్ పీర్ టు పీర్ కనెక్షన్ ద్వారా పంపించబడతాయని.. డేటా సర్వర్లలో స్టోర్ చేయబడదని స్పష్టం చేసింది. కాగా, శాంసంగ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ సరికొత్త ఫీచర్‌తో ఆండ్రాయిడ్, ఐఫోన్‌ల మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More:
సెల్ఫీ మిర్రర్‌తో భారత్‌లో తొలి ఫోన్.. 7000mAh భారీ బ్యాటరీతో రియల్‌మీ సర్‌ప్రైజ్!
9000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ.. గేమింగ్ యూజర్లే టార్గెట్‌గా కొత్త 5జీ ఫోన్!
వివో నుంచి త్వరలోనే రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలు లీక్!
