Shubman Gill ODI Captain | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా గిల్

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్ గా ఎంపిక. రోహిత్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ జట్టులో ఉన్నారు.

Shubman Gill ODI Captain | ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా గిల్

విధాత : ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు టీమిండియా కెప్టెన్ గా శుభమన్ గిల్ ను సెలక్షన్ కమిటీ నియమించింది. రోహిత్ శర్మను వన్డే టీమ్ కెప్టెన్ గా తప్పించినప్పటికి ఆటగాడిగా ఎంపిక చేసింది. మరో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లిని కూడా వన్డే జట్టులోకి ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ ను వన్డే టీమ్ వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. గాయం కారణంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ జట్టుకు దూరమయ్యారు. ఇప్పిటికే టెస్టు జట్టు కెప్టెన్ గా ఉన్న గిల్..వన్డే జట్టు కెప్టెన్ గా కూడా ఎంపికవ్వగం గమనార్హం. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ 20మ్యాచ్ లు ఆడనుంది. వన్డే, టీ 20ల కోసం భారత సెలక్షన్ కమిటీ జట్లను ప్రకటించింది. టీ20లకు సూర్యకుమార్‌ సారథిగా కొనసాగనున్నారు.

వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, హర్షిత్ రాణా, సిరాజ్, అర్ష్‌దీప్, ప్రసిద్ధ్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్.

టీ20 జట్టు: సూర్యకుమార్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ (వైస్‌ కెప్టెన్), నితీశ్ కుమార్‌ రెడ్డి, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, అర్ష్‌దీప్, కుల్‌దీప్, హర్షిత్, సంజు శాంసన్, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్.