Syed Kirmani | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ క్రికెటర్ కిర్మాణి

Syed Kirmani | సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ క్రికెటర్ కిర్మాణి

విధాత : ప్రముఖ మాజీ క్రికెటర్ సయ్యద్ కిర్మాణి(Syed Kirmani) సీఎం రేవంత్ రెడ్డిని(CM Revanth reddy) కలిశారు. రాష్ట్ర కార్మిక, ఉపాధి, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి(Minister Vivek Venkataswamy) శనివారం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి కిర్మాణిని తీసుకెళ్లి పరిఛయం చేశారు. ఈ సందర్భంగా వారు రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి అంశాలపై చర్చించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో క్రీడలకు మరింత బలం చేకూరనుందని తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీ రూపకల్పన దిశగా కిర్మాణితో చర్చించామన్నారు.

కిర్మాణి క్రికెట్ సేవలను ప్రశంసిస్తూ రాష్ట్రానికి ఆయన మార్గనిర్దేశం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం క్రీడలకు అనువైన వేదికగా ఎదుగుతోందన్నారు. లెజెండ్స్‌ ప్లేయర్ల ద్వారా యువతకు ప్రేరణ కలిగించే ప్రయత్నాల్లో భాగంగా ఈ భేటీని ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు. ఈ సమావేశం సానుకూల వాతావరణంలో ముగిసిందని తెలిపారు. సయ్యద్ కిర్మాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడా విధానాలపై చర్చ జరిగిందని..ప్రభుత్వ క్రీడా ప్రణాళికలు…విధానాలు బాగుున్నాయని అభినందనలు తెలియజేశారు. యువతలో ప్రతిభను వెలికితీయాల్సిన అవసరాన్ని సూచించారు.