Dhoni| ధోని బర్త్ డే సెలబ్రేషన్స్.. ఆయన భార్య చేసిన పనికి అంతా షాక్
Dhoni| టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) 43వ పడిలోకి అడుగుపెట్టాడు. 1981 జులై 7న రాంచీలో జన్మించిన ధోనీ తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ధోని క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. బెస్ట్ ఫినిషర్‌గా

Dhoni| టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) 43వ పడిలోకి అడుగుపెట్టాడు. 1981 జులై 7న రాంచీలో జన్మించిన ధోనీ తన ఆటతీరుతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. దాదాపు 15 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ధోని క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్నీ కావు. బెస్ట్ ఫినిషర్‌గా, మిస్టర్ కూల్ కెప్టెన్‌గా, ఉత్తమ వికెట్ కీపర్‌గా కూడా మంచి రికార్డ్ లు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.. భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్ (2007), రెండో వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) గెలుచుకోవడం ద్వారా ధోనీ ఈ గొప్ప ఫీట్ సాధించాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ నుండి ధోని తప్పుకున్నా కూడా ఆయన క్రేజ్ తగ్గలేదు.
ఏపీలోని నందిగామలో తెలుగు ధోని ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జులై 6(శనివారం) నాడు బారీ కటౌట్‌ని ఆవిష్కరించారు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న ధోని అభిమానులు స్వీట్లు పంచడం, అన్నదానం చేయడం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక తెలుగు అభిమానులు ధోనికి అంత భారీ కటౌట్ ఏర్పాటు చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ధోని 43వ పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులు ఘనంగా నిర్వహించారు. బర్త్ డే బాయ్ ధోనీతో కేక్ కట్ చేయించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మహేంద్ర సింగ్ ధోనీ, అతని సతీమణి సాక్షి ఉన్నారు. ధోనీ కేక్ కట్ చేయగా.. ఒకరినొకరు కేక్ తినిపించుకున్నారు.
అనంతరం సాక్షి ధోని మహేంద్ర సింగ్ ధోనీ పాదాలకు నమస్కారం చేసి సాక్షి ఆశీర్వాదం తీసుకున్నారు. దీంతో అక్కడ ఉన్నవారంతా చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఆ సమయంలో ధోని చిరునవ్వులు చిందించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, వారి ప్రేమని చూసి మురిసిపోతున్నారు. ఈ వీడియోకి గంట్లోనే 30 లక్షలకి పైగా వ్యూస్ రావడం విశేషం. ఇక ధోనికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(salman khan) కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ‘హ్యాపీ బర్త్‌డే కెప్టెన్ సాహబ్’ అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు
MS Dhoni celebrating his 43rd birthday with Sakshi. ❤️⭐#HappyBirthdayDhoni pic.twitter.com/fC1ExC8mMX
— Johns. (@CricCrazyJohns) July 6, 2024
100 FEET CUT-OUT OF MS DHONI BY TELUGU FANS. 🥶
– Birthday celebration begins for Thala…!!!! pic.twitter.com/QatZw2Jb7Q
— Johns. (@CricCrazyJohns) July 6, 2024