గేల్‌ తింటున్న బర్గర్‌ ఎంత పెద్దదో చూశారా?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్ల స్వదేశాలకు తిరిగి వెళ్లారు. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌, ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్‌గేల్‌ మాత్రం ఎంజాయ్‌ చేయడానికి మాల్దీవులకు వెళ్లాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో కామెంటేటర్‌ కెవిన్‌ పీటర్సన్‌తో కలిసి తాజ్‌ మాల్దీవుల్లో ఉంటున్నాడు. విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గేల్‌ ఐలాండ్‌ దేశంలో విహరిస్తున్నాడు. https://www.instagram.com/p/COr6t60BBNl/?utm_source=ig_web_copy_link తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన బర్గర్‌ తింటున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.తన జీవితంలో తింటున్న […]

  • Publish Date - May 11, 2021 / 04:49 AM IST

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్ల స్వదేశాలకు తిరిగి వెళ్లారు. వెస్టిండీస్‌ బ్యాట్స్‌మన్‌, ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిస్‌గేల్‌ మాత్రం ఎంజాయ్‌ చేయడానికి మాల్దీవులకు వెళ్లాడు. ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో కామెంటేటర్‌ కెవిన్‌ పీటర్సన్‌తో కలిసి తాజ్‌ మాల్దీవుల్లో ఉంటున్నాడు. విండీస్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ గేల్‌ ఐలాండ్‌ దేశంలో విహరిస్తున్నాడు.

https://www.instagram.com/p/COr6t60BBNl/?utm_source=ig_web_copy_link

తాజాగా స్విమ్మింగ్‌ పూల్‌ పక్కన బర్గర్‌ తింటున్న వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.
తన జీవితంలో తింటున్న అతిపెద్ద బర్గర్‌ ఇదేనని వ్యాఖ్యానించాడు. బ్రేకింగ్‌ న్యూస్‌: యూనివర్స్‌ బాస్‌ తింటున్న అతిపెద్ద బర్గర్‌ ఇదేనంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.