ICC World Test Championship | వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్ టేబుల్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి టీమిండియా

ICC World Test Championship | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు రెండోస్థానంలో కొనసాగుతున్నది. 120 రేటింగ్ పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్నది 124 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది.

ICC World Test Championship | వరల్డ్‌ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ పాయింట్స్ టేబుల్‌లో నెంబర్‌ వన్‌ స్థానానికి టీమిండియా

ICC World Test Championship | ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు రెండోస్థానంలో కొనసాగుతున్నది. 120 రేటింగ్ పాయింట్లతో సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా నెంబర్‌ వన్‌గా కొనసాగుతున్నది 124 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. ఇక వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు వద్ద 105 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది. ఇక వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భారత్‌ అగ్రస్థానంలో ఉన్నది. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరు విజయాలు సాధించింది.

రెండింట్లో ఓడిపోగా, ఒకటి డ్రాగా ముగిసింది. జూన్ 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ స్థానమే లక్ష్యంగా దూసుకువెళ్తున్నది. గత రెండు ఎడిషన్స్‌లో ఫైనల్‌కు వెళ్లినా టైటిల్‌ను నెగ్గలేకపోయింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లండ్ – వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ముగిసింది. ఆతిథ్య ఇంగ్లండ్ వరుసగా మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి 3-0తో విండీస్ జట్టును క్లీన్ స్వీప్ చేసింది. తొలి టెస్టులో ఇంగ్లిష్ జట్టు 10 వికెట్ల తేడాతో, రెండో టెస్టులో 241 పరుగుల తేడాతో, మూడో టెస్టులో ఇన్నింగ్స్ 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ మరియు వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ తర్వాత, ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్స్ టేబుల్‌లో ఆరో స్థానానికి చేరింది. ఈ సైకిల్‌లో ఇంగ్లండ్ 13 మ్యాచులలో ఆరు గెలిచింది. ఒక మ్యాచ్‌ డ్రా కాగా.. మరోదాంట్లో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ ప్రస్తుతం 57 పాయింట్లు ఉన్నాయి.

ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండగా, మూడు విజయాలతో ఇప్పుడు ఆరో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ జట్టు ఆగస్టు 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. అదే సమయంలో, వెస్టిండీస్ జట్టు సిరీస్‌లో 0-3తో ఓడిపోయి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ సైకిల్‌లో ఇప్పటివరకు వెస్టిండీస్ ఏడు మ్యాచ్‌లు ఆడగా ఒకదానిలో మాత్రమే గెలిచింది, ఐదు ఓడింది. విండీస్ జట్టు 16 పాయింట్లు, 19.05 విజయ శాతంతో తొమ్మిదో స్థానంలో ఉంది.