Ind vs NZ| టీమిండియా టార్గెట్ 359.. ఇది భారత జట్టుకి సాధ్యమేనా?
Ind vs NZ| బెంగళూరు టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా పూణే వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో అయిన గెలవాలని టీమిండియా భావిం

Ind vs NZ| బెంగళూరు టెస్ట్‌లో ఘోర పరాజయం తర్వాత టీమిండియా(india) పూణే వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో అయిన గెలవాలని టీమిండియా భావించగా, ఇది కష్టమే అని అర్ధమవుతుంది. భారత్ జట్టు.. పుణెలో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 156 పరుగులకే ఆలౌటైంది. దాంతో పర్యాటక న్యూజిలాండ్‌కి భారీ ఆధిక్యం దక్కింది. భారత్‌కి ఏకంగా 359 పరుగుల టార్గెట్ విధించింది. తొలి టెస్ట్‌లో కివీస్ జట్టు 259 పరుగులకి ఆలౌట్ కాగా, రెండో టెస్ట్‌లో 255 పరుగులకి ఆలౌట్ అయ్యారు. ఇక భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా జట్టు వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తుంది.
మూడో రోజు కివీస్ జట్టు బ్యాటింగ్ మొదలు పెట్టగా, ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్ మిచెల్(18), బ్లండెల్(41), ఫిలిప్స్ (48 నాటౌట్), శాంట్నర్ (4), సౌథీ(0), పటేల్(1), రూక్(0 నాటౌట్) పరుగులు చేశారు. మ్యాచ్ నాల్గో ఇన్నింగ్స్‌లో భారత్ 359 పరుగుల టార్గెట్ చేయడం చాలా కష్టం. అయితే రెడ్ బాల్ ఫార్మాట్‌లో టీమిండియా కొన్ని భారీ పరుగులను కూడా ఛేదించింది. ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచి భారీ స్కోర్‌లను ఛేదించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ప్రస్తుతం పూణె టెస్ట్‌లోనూ ఇలాంటి సీన్ రిపీట్ కావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. . టెస్ట్ క్రికెట్(Test Cricket) చరిత్రలో భారత జట్టు ఛేజింగ్ చేసిన 3 సందర్భాల గురించి చూస్తే … 2021 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు కంగారూ జట్టును ఓడించింది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది.
2008లో ఇంగ్లండ్‌పై 387 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని సాధించి కొత్త చరిత్ర లిఖించింది. చెన్నైలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక టీమిండియా టెస్టు క్రికెట్ చరిత్రలో 1976లో వెస్టిండీస్‌పై స్వదేశంలో జరిగిన అతిపెద్ద పరుగుల వేటగా ఇది నిలిచింది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్‌లోని మూడో టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్(West Indies) భారత్‌కు 403 పరుగుల విజయ లక్ష్యాన్ని అందించింది. మరి ప్రస్తుతం టీమిండియా ఆటగాళ్లు నిలకడగా ఆడుతూ ఆ టార్గెట్ చేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్ శర్మ (8) పరుగులకి ఔట్ కాగా, క్రీజులో యశస్వి (29),గిల్ (11) ఉన్నారు. భారత స్కోరు వికెట్ నష్టానికి 53పరుగులు.