IPL లో సెంచ‌రీలు బాదిన భార‌త‌ ఆట‌గాళ్లు…, ఎవ‌రెన్ని సెంచ‌రీలు చేశారో చూడండి!!

IPL అంటేనే బౌండ‌రీల వెల్లువ‌., ధ‌నాధ‌న్ మెరుపులు., బ్యాట్స్ మెన్స్ భారీ హిట్టింగులు…ఈ హిట్టింగ్ కార‌ణంగా ఈ 20 ఓవ‌ర్స్ ఫార్మ‌ట్ లో కూడా సెంచ‌రీలు కూడా సాధార‌ణ‌మే అయ్యాయి. ఇప్పుడు IPLలో సెంచ‌రీలు సాధించిన ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ గురించి చూద్దాం! 2009లో మ‌నీష్ పాండే…RCB త‌ర‌ఫున ఆడుతూ డెక్కన్ ఛార్జ‌ర్స్ పై 73 బంతుల్లో 114 ప‌రుగులు చేశాడు. 2010లో యూసుఫ్ ప‌ఠాన్….RR త‌ర‌ఫున ఆడుతూ MI పై 37 బంతుల్లోనే 100 ప‌రుగులు చేశాడు.CSK […]

  • Publish Date - May 7, 2021 / 06:41 AM IST

IPL అంటేనే బౌండ‌రీల వెల్లువ‌., ధ‌నాధ‌న్ మెరుపులు., బ్యాట్స్ మెన్స్ భారీ హిట్టింగులు…ఈ హిట్టింగ్ కార‌ణంగా ఈ 20 ఓవ‌ర్స్ ఫార్మ‌ట్ లో కూడా సెంచ‌రీలు కూడా సాధార‌ణ‌మే అయ్యాయి. ఇప్పుడు IPLలో సెంచ‌రీలు సాధించిన ఇండియ‌న్ ప్లేయ‌ర్స్ గురించి చూద్దాం!

2009లో మ‌నీష్ పాండే…RCB త‌ర‌ఫున ఆడుతూ డెక్కన్ ఛార్జ‌ర్స్ పై 73 బంతుల్లో 114 ప‌రుగులు చేశాడు.

2010లో యూసుఫ్ ప‌ఠాన్….RR త‌ర‌ఫున ఆడుతూ MI పై 37 బంతుల్లోనే 100 ప‌రుగులు చేశాడు.
CSK త‌ర‌ఫున ఆడిన ముర‌ళీ విజ‌య్…2010లో RRపై 56 బాల్స్ లో 127 ర‌న్స్., 2012లో ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 58 బాల్స్ లో 113 ర‌న్స్ చేశాడు.
2011లో పాల్ వాల్తాటి Kings XI Punjab కు ఆడుతూ CSK పై 63 బాల్స్ లో 120 ర‌న్స్ చేశాడు.
2011లో సచిన్ MI త‌ర‌ఫున ఆడుతూ Kochi Tuskers Kerala పై 66 బంతుల్లోనే 100 ప‌రుగులు చేశాడు.

ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడిన వీరేంద్ర సెహ్వాగ్…2011లో డెక్క‌న్ ఛార్జ‌ర్స్ పై 56 బాల్స్ లో 119 ప‌రుగులు, 2014లో పంజాబ్ పై 58 బాల్స్ లో 122 ర‌న్స్ చేశాడు.

RR ఆట‌గాడైన అజింక్య ర‌హానే… 2012లో RCBపై 60 బాల్స్ లో 103 ర‌న్స్ ., 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 63 బాల్స్ లో 105 ర‌న్స్ చేశాడు.
2012లో రోహిత్ శ‌ర్మ‌ MI త‌ర‌ఫున ఆడుతూ Kolkata Knight Ridersపై 60 బాల్స్ లో 109 ర‌న్స్ స్కోర్ చేశాడు.

సురేష్ రైనా (CSK)…. Kings XI Punjabపై 2013లో 53 బాల్స్ లో 100 ర‌న్స్ చేశాడు.
వృద్ధిమాన్ సాహా (Kings XI Punjab) …KKR పై 2014లో 55 బాల్స్ లో 115 ర‌న్స్ చేశాడు
విరాట్ కోహ్లీ…100,108,109,113,100…..ఇలా మొత్తం ఐపియ‌ల్ లో 5 సెంచ‌రీలు చేశాడు.

సంజూ శామ్స‌న్…. ఐపియ‌ల్ లో మొత్తం 3 సెంచ‌రీలు చేశాడు…102 (63) పూనేపై., 102 (55) హైద్రాబాద్ పై., 119 (63) పంజాబ్ పై చేశాడు.
రిష‌బ్ పంత్ 128(63) హైద్రాబాద్ పై
అంబ‌టి రాయుడు 100 (62) హైద్రాబాద్ పై…
K.L.రాహుల్ 100(64) ముంబై పై., 132( 69) ముంబైపై చేశాడు.
శిఖ‌ర్ ధావ‌న్ …. 106 ( 61) పంజాబ్ పై., 101( 58) చెన్నై పై చేశాడు.
మ‌యాంక్…. 106 ( 50) రాజ‌స్థాన్ పై చేశాడు.
దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ 101 ( 52) రాజ‌స్థాన్ పై చేశాడు.