• Telugu News
  • /Sports

Paralympics 2024 | పారాలింపిక్స్‌లో భారత్‌ బోణీ.. గోల్డ్‌ మెడల్‌ నెగ్గిన షూటర్‌ అవని లెఖారా

Paralympics 2024 : పారిస్‌ పారాలింపిక్స్‌ 2024 (Paris Paralympics 2024) లో భారత్‌ బోణీ కొట్టింది. భారత మహిళా షూటర్‌ అవని లెఖారా (Avani Lekhara) గోల్డ్‌ మెడల్‌ సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లి అవని.. ఫైనల్‌ 24.7 స్కోర్‌తో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తానే నమోదు చేసిన అత్యధిక స్కోర్‌ (249.6) రికార్డును తనే తిరగరాసింది.

Reported by: Thyagi | క్రీడలు | Aug 30, 2024, 5:06 pm IST
Read Time: 2 mins
Paralympics 2024 | పారాలింపిక్స్‌లో భారత్‌ బోణీ.. గోల్డ్‌ మెడల్‌ నెగ్గిన షూటర్‌ అవని లెఖారా

Paralympics 2024 : పారిస్‌ పారాలింపిక్స్‌ 2024 (Paris Paralympics 2024) లో భారత్‌ బోణీ కొట్టింది. భారత మహిళా షూటర్‌ అవని లెఖారా (Avani Lekhara) గోల్డ్‌ మెడల్‌ సాధించింది. క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో రెండో స్థానంలో నిలిచి ఫైనల్‌కు వెళ్లి అవని.. ఫైనల్‌ 24.7 స్కోర్‌తో గోల్డ్‌ మెడల్‌ సొంతం చేసుకుంది. టోక్యో పారాలింపిక్స్‌లో తానే నమోదు చేసిన అత్యధిక స్కోర్‌ (249.6) రికార్డును తనే తిరగరాసింది.

పారాలింపిక్స్‌ షూటింగ్‌ (Shooting) 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ (10m air rifle) విభాగంలో పారా షూటర్‌ అవని లెఖారాతోపాటు మరో భారత్‌ షూటర్ మోనా అగర్వాల్‌ (Mona Agarwal) కూడా పతకం నెగ్గింది. మోనా ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్‌ రౌండ్‌లో మోనా అగర్వాల్‌ 5 స్థానంలో నిలిచి ఫైనల్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంది. ఫైనల్‌ పతకం సాధించింది.