Ram Charan | రామ్ చ‌రణ్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్.. మ‌ళ్లీ షూటింగ్ ఎప్ప‌టి నుండి మొద‌లు అంటే…!

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ . ఈ మూవీ షూటింగ్‌లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో రామ్ చ‌ర‌ణ్‌ ఎడమ కంటికి స్వల్ప గాయం అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ పడిందని, కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

  • By: Sandeep |    movies |    Published on : Mar 26, 2026 8:01 AM IST
Ram Charan | రామ్ చ‌రణ్ హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన మేక‌ర్స్.. మ‌ళ్లీ షూటింగ్ ఎప్ప‌టి నుండి మొద‌లు అంటే…!

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ . ఈ మూవీ షూటింగ్‌లో చిన్న అపశృతి చోటుచేసుకుంది. యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో రామ్ చ‌ర‌ణ్‌ ఎడమ కంటికి స్వల్ప గాయం అయినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో షూటింగ్‌కు బ్రేక్ పడిందని, కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.ఇక ఈ వార్తలు వైరల్ కావడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ స్పందిస్తూ ట్వీట్ చేయడంతో గాయం తీవ్రతపై మరింత చర్చ మొదలైంది.

చ‌ర‌ణ్ క్షేమం..

అయితే ఈ రూమర్లకు చెక్ పెడుతూ ‘పెద్ది’ చిత్ర బృందం అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ ఎడమ కంటికి కేవలం స్వల్ప గాయం మాత్రమే జరిగిందని, వెంటనే అవసరమైన చికిత్స తీసుకున్నారని తెలిపింది. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని క్షేమంగా ఉన్నారని స్పష్టం చేసింది.

ఇంకా షూటింగ్ షెడ్యూల్‌పై ఎటువంటి ప్రభావం పడలేదని, ముందుగా నిర్ణయించినట్లుగానే గురువారం (మార్చి 26) నుంచి రామ్ చరణ్ తిరిగి సెట్స్‌లో పాల్గొంటారని వెల్లడించింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చిత్ర యూనిట్ విజ్ఞప్తి చేసింది.

బర్త్‌డే స్పెషల్ అప్డేట్:

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ప్రత్యేక అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఉదయం 11:07 గంటల నుంచి ‘పెద్ది’కి సంబంధించిన భారీ సర్ప్రైజ్ ఉండబోతుందని, “మాస్ రాంపేజ్” కోసం సిద్ధంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

‘పెద్ది’ చిత్రాన్ని బుచ్చిబాబు స‌న‌ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ కొనసాగుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే మృణాల్ ఠాకూర్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు సమాచారం.

ఇతర కీలక పాత్రల్లో శివ‌రాజ్ కుమార్, జ‌గ‌ప‌తి బాబు, దివ్యాంశు శ‌ర్మ‌, బొమ‌న్ ఇరానీ, స‌త్య తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.