Paris Olympics | రెజ్లింగ్‌లో అమన్‌ సెహ్రావత్‌ ‘పట్టు’.. భారత్‌ ఖాతాలో మరో కాంస్య పతకం..

Paris Olympics | పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అద్భుత చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. పతక పోరులో అమన్‌ 13-5 తేడాతో ప్యూర్టోరికోకు చెందిన డారియన్‌ టోయ్‌ క్రూజ్‌ని ఓడించారు.

Paris Olympics | రెజ్లింగ్‌లో అమన్‌ సెహ్రావత్‌ ‘పట్టు’.. భారత్‌ ఖాతాలో మరో కాంస్య పతకం..

Paris Olympics | పారిస్‌ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అద్భుత చేసి కాంస్య పతకాన్ని సాధించాడు. పతక పోరులో అమన్‌ 13-5 తేడాతో ప్యూర్టోరికోకు చెందిన డారియన్‌ టోయ్‌ క్రూజ్‌ని ఓడించారు. అంతకు ముందు ఛత్రసల్ రెజ్లర్ అమన్ గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. పురుషుల 57 కిలోల ప్రీస్టయిల్‌ విభాగంలో సెమీ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన టాప్‌ సీడ్‌ రీ హిగుచితో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాడు. కాంస్య పతక పోరులో అద్భుత ప్రదర్శన చేసి పారిస్ క్రీడల్లో దేశానికి ఆరో పతకాన్ని అందించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ ఇప్పటి వరకు ఐదు కాంస్యం, ఒక రజతం సహా మొత్తం ఆరు పతకాలు సాధించింది.

తొలి రౌండ్‌లోనే ముందంజలో..

తొలి రౌండ్‌లోనే 6-3తో ముందంజలో అమన్‌ ముందజలో నిలిచాడు. రెండో రౌండ్‌లో అమన్ తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్నాడు. టోయ్‌ క్రూజ్‌కి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. దీంతో అమన్‌ సెహ్రావత్‌ విజయం ఖరారవగా భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. ప్యారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అమన్ మాత్రమే పురుషుల విభాగంలో పతకం నెగ్గాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ నుంచి భారత్ ప్రతి ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకాలు సాధిస్తూ వస్తోంది. 2008లో సుశీల్ కుమార్ కాంస్యం, 2012లో సుశీల్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం, సాక్షి మాలిక్ 2016లో కాంస్యం, రవి దహియా రజతం, బజరంగ్ పునియా 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించారు. అమన్‌ మొదటిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని.. కాంస్య పతకాన్ని గెలిచాడు. తద్వారా ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో భారత్ పతకాల ఖాతా తెరిచాడు అమన్. వినేష్ ఫోగట్‌పై అనర్హత వేటు పడిన తర్వాత నిరాశలో ఉన్న భారత్‌కు అమన్‌ కాస్త ఊరటనిచ్చాడు.

Read Also :

Paris Olympics 2024 | ముగింపు దశకు పారిస్‌ ఒలింపిక్స్‌.. రెజ్లర్‌ రీతికా పసిడిపట్టు పట్టేనా..!

paris olympics 2024 |ఈ సారి రజతంతో స‌రిపెట్టుకున్న బ‌ల్లెం వీరుడు.. ప్ర‌ధాని మోదీ ప్ర‌శంస‌లు