Rachin Ravindra| రచిన్ రవీంద్ర.. ఈ పేరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సీఎస్కే తరపున ఆడుతున్న రచిన్ రవీంద్రకి సంబంధించిన వార్తలు ఇటీవల ఎక్కువగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. భారత సంతతికి చెందిన ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ లో తెలియని కోణం కూడా ఒకటి ఉంది. అతనిలో ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ క్రికెటర్ రిం
Rachin Ravindra| రచిన్ రవీంద్ర.. ఈ పేరు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సీఎస్కే తరపున ఆడుతున్న రచిన్ రవీంద్రకి సంబంధించిన వార్తలు ఇటీవల ఎక్కువగా నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. భారత సంతతికి చెందిన ఈ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ లో తెలియని కోణం కూడా ఒకటి ఉంది. అతనిలో ఒక ప్రేమికుడు కూడా ఉన్నాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అత్యుత్తమ ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఈ టాలెంటెడ్ క్రికెటర్ రింగురింగుల జుట్టు, నిగనిగలాడే ముఖం, ఫిట్ గా వుండే బాడీతో యువతులని ఇట్టే ఆకర్షిస్తున్నాడు. అయితే అతనికి అందమైన ప్రేయసి ఉంది. ఆమె పేరు ప్రేమిలా మోరార్. ఈమె గురించి సెర్చ్ చేస్తే సోషల్ మీడియాలో హాట్ పిక్స్ దర్శనం ఇస్తున్నాయి.
23 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ ప్రేమిలా మొరార్ రచిన్ అందానికో, ఆటకో పడిపోయింది. ఆమెది న్యూజిలాండ్ లోనే ఆక్లాండ్ పుకెకోహే ఈస్ట్ స్వస్థలం. జనవరి 24, 2001 లో భారత సంతతికే చెందిన మోరార్ నాయక్, మినా దంపతులకు ఆమె జన్మించింది. మాస్సే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్ లో చదివిన ప్రేమిలా మొరార్ ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్ కొనసాగిస్తుంది. ఫ్యాషన్స్ పేరిట ఓ స్టోర్ ను నిర్వహిస్తున్నారు. ఆమెకి చదువుకునే రోజులలో ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. 2017లో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని విజేతగా నిలవడంతో ఫ్యాషన్ డిజైనింగ్ వైపు అడుగులు వేసింది. 2022 నాటికి ఓ సొంత ఫ్యాషన్ స్టోర్ తో పాటు తన ఫ్యాషన్ లేబుల్ కింద మోరార్ గ్రాడ్యుయేట్ కలెక్షన్ కూడా ప్రారంభించింది.
ఇలా డిజైన్ చేసిన ఓ జాకెట్ ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్ కవర్ పేజీపై కూడా దర్శనమిచ్చింది. ఇక సెప్టెంబర్ 27, 2020 లో వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. పబ్లిసిటీని పెద్దగా ఇష్టపడని రచిన్ తన ప్రేమని సీక్రెట్ గా ఉంచాడు. వన్డే ప్రపంచ కప్ సమయంలో రచిన్ ప్రేమాయణం గురించి బయటపడగా,అప్పటి నుండి ప్రేమిలాకి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. రచిన్ రవీంద్ర 1999 నవంబర్ 18న న్యూజీలాండ్‌లోని వెల్లింగ్టన్లో పుట్టాడు. రాహుల్ ద్రవిడ్ పేరులోని ‘ర’.. సచిన్ పేరులోని ‘చిన్’ స్పూర్తిగా అతడికి ఆ పేరు పెట్టినట్లు తెలుస్తున్నది. బెంగళూరుకు చెందిన రవి కృష్ణమూర్తి, దీపా దంపతులకు రచిన్ జన్మించాడు. రవి కృష్ణమూర్తి సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఆర్కిటెక్ట్ కాగా, ఆయన 1990ల్లోనే న్యూజీలాండ్‌కు వలస వెళ్లాడు. అక్కడే రచిన్ జన్మించాడు.