టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్

టీమిండియా టీ20 జట్టుకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యగా, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం లభించింది.

ఐర్లాండ్, ఇంగ్లాండ్‌ పర్యటనలతో సహా ఆసియా క్రీడలకు భారత టీ20 జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. టీ 20 టీమ్ కు సూర్య స్థానంలో కొత్త కెప్టెన్ గా శ్రేయస్‌ అయ్యర్‌ను ఎంపిక చేసింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ కట్టబెట్టింది. వైభవ్‌ సూర్యవంశీకి తొలిసారిగా టీమిండియా జట్టులో స్థానం కల్పించింది.

జట్టు వివరాలు: శ్రేయస్‌ అయ్యర్(కెప్టెన్), తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), బిష్ణోయ్‌, అభిషేక్‌ శర్మ, నితీశ్‌కుమార్‌ రెడ్డి, మహ్మద్ సిరాజ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌రాణా, ఇషాన్‌ కిషన్‌, వాషింగ్టన్‌ సుందర్, అర్ష్‌దీప్‌ సింగ్, శివమ్‌ దూబె, వరుణ్‌చక్రవర్తి, ప్రిన్స్‌యాదవ్‌, వైభవ్ సూర్యవంశీ. ఆసియా గేమ్స్‌లో సిరాజ్‌, ప్రిన్స్‌ యాదవ్‌ స్థానంలో సీనియర్ పేసర్ బుమ్రాకు అవకాశం కల్పించారు.

Latest News