Smriti Mandhana| సంగీత్‌లో స్మృతి మంధాన జంట డ్యాన్స్ వైరల్!

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సంగీత్ వేడుకలో మంధాన కాబోయే భర్త పలాష్ తో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అలరించింది.

Smriti Mandhana| సంగీత్‌లో స్మృతి మంధాన జంట డ్యాన్స్ వైరల్!

విధాత: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి వేడుకలు(Weddings)వైభవంగా జరుగుతున్నాయి. సంగీత్ వేడుక(sangeet dance)లో మంధాన కాబోయే భర్త పలాష్ తో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అలరించింది. మైదానంలో దూకుడు చూపించే మంధాన.. సంగీత్ వేదికపై కూడా అదే ఉత్సాహాన్ని చూపడంతో ఈ కొత్త జంట డ్యాన్స్ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ జంట ఇవాళ సాంగ్లీలో వివాహబంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈ జంట ఎంగేజ్ మెంట్ నుంచి పెళ్లి వరకు వరుసగా జరుగుతున్న వేడుకల్లో టీమిండియా మహిళా క్రికెటర్లు అంతా సందడి చేస్తున్నారు. తమ డ్యాన్స్ లతో అదరగొడుతున్నారు. పెళ్లి వేడుకలలో భాగంగా స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ఇద్దరూ ప్రీ వెడ్డింగ్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఆడారు. వీరు తమ బృందంతో పెళ్లి కూతురు జట్టు, పెళ్లి కుమారుడి జట్టుగా విడిపోయి సందడి చేశారు. పెళ్లి కూతురు జట్టుకు (టీమ్‌ బ్రైడ్‌) మంధాన, పెళ్లి కొడుకు జట్టుకు (టీమ్‌ గ్రూమ్‌) పలాశ్‌ ముచ్చల్‌ కెప్టెన్లుగా వ్యవహరించారు. స్మృతిమంధాన జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్‌, రాధా యాదవ్‌, రిచా ఘోష్‌ తమ ఆటతో అలరించారు.