India| రోహిత్ తప్పుకోవడంతో హార్ధిక్‌ని కాదని టీ20లకి కెప్టెన్‌గా అతనిని తీర్చిదిద్దనున్నారా..!
India| టీమిండియా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుతంగా ఆడిన జట్టు కలలని సాకారం చేసుకుంది. 17 ఏళ్లుగా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ రాగా, ఎట్టకేలకి ఈ ఏడాది కప్ సాధించారు. ఇక ట్రోఫీ గెలవడంతో

India| టీమిండియా ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. రోహిత్ నాయకత్వంలో అద్భుతంగా ఆడిన జట్టు కలలని సాకారం చేసుకుంది. 17 ఏళ్లుగా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ రాగా, ఎట్టకేలకి ఈ ఏడాది కప్ సాధించారు. ఇక ట్రోఫీ గెలవడంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ20లకి గుడ్ బై చెప్పడం మనం చూశాం. అయితే ఇప్పుడు టీ20 ఫార్మాట్‌లో భారత సారథి స్థానం ఖాళీ కావడంతో ఇప్పుడు టీ20లకి కెప్టెన్‌గా ఎవరిని ఎంపికచేయాలనే ఆలోచన చేస్తున్నారు. రోహిత్ అనంతరం హార్దిక్‌నే ఫ్యూచర్ కెప్టెన్ అని అందరూ ఫిక్స్ కాగా, ఇప్పుడు కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్ వచ్చినట్టు తెలుస్తుంది. అతనిని సారథిగా తీర్చిదిద్దాలని గంభీర్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
టీ20 వరల్డ్ కప్-2026ని దృష్టిలో పెట్టుకుని టీమిండియా కొత్త కెప్టెన్‌గా ఎవరిని ఎంపిక చేయాలని నయా కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్టర్లు తీవ్రంగా చర్చిస్తున్నట్టు సమాచారం. హార్ధిక్ పాండ్యాని భవిష్యత్ కెప్టెన్ ప్రణాళిక నుండి పక్కన పెట్టినట్టు ఓ వార్త వైరల్ అవుతుంది. రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ ఓ టీ20 సిరీస్‌కు సారథిగా బాధ్యతలు ఇప్పటికే నిర్వర్తించాడు.ఇక టీ20 వరల్డ్ కప్-2026 వరకు సూర్యనే టీ20లకు కెప్టెన్‌గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు జాతీయ మీడియా తెలియజేసింది. జులై 27 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక టీ20 సిరీస్ నుండే సూర్య కెప్టెన్‌గా ఉంటాడని ఆ వార్తలో రాసుకొచ్చారు.
రోహిత్ శర్మ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే హార్ధిక్ పాండ్యానే ఎంపిక చేస్తారని అందరు అనుకున్నా వరుస గాయాలతో జట్టులో రెగ్యులర్‌గా ఉండట్లేదు కాబట్టి సూర్యని ఎంపిక చేస్తే బాగుంటుందని కొత్త కోచ్ ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. బుమ్రా కూడా కెప్టెన్సీ విషయంలో సూర్యకి గట్టి పోటీ ఇచ్చిన పనిభారంతో పాటు కెప్టెన్సీ ఒత్తిడి బుమ్రాపై తీసుకురావద్దని బీసీసీఐ సూర్యను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సూర్య అద్భుతమైన బ్యాటింగ్‌తో టీ20లలో మంచి రికార్డులు కూడా సాధించడం మనం చూశాం.