Virat Kohli|కోహ్లీ 12 ఏళ్ల కల తీరుతుందా.. ఆ ముగ్గురు ఆటగాళ్లకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అవుతుందా?
Virat Kohli| ఈ నెల మొదట్లో ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. జూన్ 29న బార్బడోస్‌లో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఫైనల్
Virat Kohli| ఈ నెల మొదట్లో ప్రారంభమైన టీ20 ప్రపంచ కప్ తుది దశకు చేరుకుంది. జూన్ 29న బార్బడోస్‌లో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. గ్రూప్ దశలో భారత్ 3 మ్యాచ్‌లు గెలవగా, 1 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అదే సమయంలో, సూపర్ 8లో, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కి వెళ్లింది. ఇక సెమీఫైనల్స్‌లోనూ ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తప్పక గెలిచి టీ20 అంతర్జాతీయ కెరీర్‌ని అద్భుతంగా ముగించాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భావిస్తున్నారు.

రోహిత్, విరాట్‌లకి ఇదే చివరి టీ20 అంతర్జాతీయ సిరీస్ అవుతుంది. కాబట్టి ఈ సారి కప్ గెలిచి సగర్వంగా టీ20 మ్యాచ్‌లకి రిటైర్మెమెంట్ ప్రకటించాలని ఆ ఇద్దరు కోరుకుంటున్నారు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ ఇండియాలో రోహిత్ శర్మ సభ్యుడు. కోహ్లీకి మాత్రం టీ20 ప్రపంచకప్ కలగానే మిగిలిపోయింది.12 ఏళ్లుగా కోహ్లీ టీ 20 ప్రపంచ కప్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. ఈ సారి ఆ కోరిక తీర్చుకోవాలనే కసితో ఉన్నాడు. ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీ తర్వాత సీనియర్ ఆటగాళ్లు టీ20 ప్రపంచ కప్ తర్వాత వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ముందుగా రోహిత్ వచ్చ టీ20 వరల్డ్ కప్‌కి అందుబాటులో ఉండడు. 37 ఏళ్ల రోహిత్‌కి వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి 39 ఏళ్లు నిండుతాయి. ఈ క్రమంలో ఆయన వచ్చే టీ20 వరల్డ్ కప్ టోర్నీకి తప్పక దూరం అవుతాడు.
ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఈ టీ20 ప్రపంచకప్ తర్వాత, తదుపరి ఎడిషన్ 2026లో ఉంటుంది. ఈ మధ్య సెలక్టర్స్ కోహ్లీని టీ20లకి ఎంపిక చేయడం లేదు. వరల్డ్ కప్ కోసం తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. అయితే దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో కోహ్లి చివరిసారిగా టీమిండియా తరపున టీ20 ఇంటర్నేషనల్ ఆడి ఆపై రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక టీ20 టోర్నీ నుండి రిటైర్మెంట్ ప్రకటించే మరో ఆటగాడు రవీంద్ర జడేజా. ఆయన టీ20లలో బ్యాటింగ్, బౌలింగ్ అంత ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ఈ క్రమంలో ఆయన అంతర్జాతీయ టీ20 నుంచి రిటైర్ అయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు మరి కొందరు సీనియర్ ఆటగాళ్లు సైతం టీ20లకి దూరం అయ్యే అవకాశం కనిపిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram