WBC2023| మ‌హిళ‌ల బాక్సింగ్ ప్ర‌పంచ‌క‌ప్‌.. భారత్‌కు స్వ‌ర్ణం

విధాత: మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం ద‌క్కింది. 48 కేజీల విభాగంలో భార‌త బాక్స‌ర్ నీతూ గంగాస్ ప్ర‌పంచ చాంపియ‌న్‌గా నిలిచింది. 22 ఏండ్ల నీతూ గంగాస్.. ఫైన‌ల్లో మంగోలియా బాక్స‌ర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో ఓడించి, స్వ‌ర్ణ ప‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. గ‌తేడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణాలు కొల్ల‌గొట్టిన నీతూ.. ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో తాజాగా త‌న స‌త్తా చాటింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ […]

  • By: krs    sports    Mar 25, 2023 12:20 PM IST
WBC2023| మ‌హిళ‌ల బాక్సింగ్ ప్ర‌పంచ‌క‌ప్‌.. భారత్‌కు స్వ‌ర్ణం

విధాత: మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో భార‌త్‌కు స్వ‌ర్ణం ద‌క్కింది. 48 కేజీల విభాగంలో భార‌త బాక్స‌ర్ నీతూ గంగాస్ ప్ర‌పంచ చాంపియ‌న్‌గా నిలిచింది. 22 ఏండ్ల నీతూ గంగాస్.. ఫైన‌ల్లో మంగోలియా బాక్స‌ర్ లుత్సాయిఖాన్ అట్లాంట్సెట్‌సెగ్‌ను 5-0 తేడాతో ఓడించి, స్వ‌ర్ణ ప‌త‌కాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

గ‌తేడాది స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీ, కామ‌న్‌వెల్త్ క్రీడ‌ల్లో స్వ‌ర్ణాలు కొల్ల‌గొట్టిన నీతూ.. ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్‌లో తాజాగా త‌న స‌త్తా చాటింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో నీతూ తొలిసారిగా ఫైనల్ ఆడారు. ఫైన‌ల్లో బౌట్‌ ప్రారంభంతోనే ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించిన నీతూ.. తొలి రౌండ్‌లో మంగోలియన్‌ బాక్సర్‌కు ఎక్కడా సందు దొరకనీయలేదు.

ఈ టోర్నీలో గంగాస్‌.. కొరియా బాక్సర్‌ కాంగ్‌ డియోయాన్‌ను ఓడించడం ద్వారా తన జైత్రయాత్రను ప్రారంభించింది. క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన వడా మడోకాను మట్టికరిపించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో అలువా బెల్కిబెకోవాపై 5-2 తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి ఫైనల్లో ప్రవేశించింది.

భార‌త్‌కు చెందిన మేరీకోమ్(ఆరు సార్లు), స‌రితా దేవీ, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీ, నిఖ‌త్ జ‌రీన్ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ చాంపియ‌న్లుగా అవ‌త‌రించ‌గా, ఇప్పుడు ఆ జాబితాలో నీతూ సైతం చేరింది. స్వ‌ర్ణం ద‌క్కించుకున్న నీతూకు దేశ వ్యాప్తంగా అభినంద‌న‌లు వెలువెత్తుతున్నాయి.