అక్కడ పుష్ప 2 వినాయకుడు!
వినాయక చవితి వేడుకల్లో సినిమాల ప్రభావం వేట కనిపిస్తూనే ఉంటుంది గతంలో బాహుబలి రోబో సినిమా సెటప్ తో వినాయక మండపాలు విగ్రహాల ఏర్పాటు చేసిన అభిమానులు ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరోల సినిమాల సెటప్లతో వినాయక వేడుకలు నిర్వహిస్తున్నారు.

విధాత : వినాయక చవితి వేడుకల్లో సినిమాల ప్రభావం వేట కనిపిస్తూనే ఉంటుంది గతంలో బాహుబలి రోబో సినిమా సెటప్ తో వినాయక మండపాలు విగ్రహాల ఏర్పాటు చేసిన అభిమానులు ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరోల సినిమాల సెటప్లతో వినాయక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని డెంకానియ కొట్టాయ్ లో వినాయక చవితికి పుష్ప 2 సినిమా సెటప్ తో వినాయక మండపం, విగ్రహం ఏర్పాటు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఏకంగా 30 లక్షలు ఖర్చుపెట్టి మండపాన్ని ఎర్రచందనం దుంగల ఆకృతిలో నిర్మించారు. ఎంట్రన్స్ లో హెలికాప్టర్ వద్ద గన్ తో ఉన్న పుష్పరాజ్ విగ్రహం పెట్టారు. లోపలికి వెళ్ళాక ఓ వైపున గంగమ్మ జాతర లో చీర కట్టులో ఉండే పుష్పరాజ్ ను తలపించేలా వినాయకుడి విగ్రహాన్ని పెట్టారు. క్లైమాక్స్ సీన్ లో అల్లు అర్జున్ (పుష్ప రాజ్) చీర ధరించి త్రిశూలం చేత పట్టిన సీన్ తరహాలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.