Viral: స్టీరింగ్‌ ఒక‌రు… గేర్ ఒక‌రు..ప్రాణాలు ప్రాణాలు గాల్లో

Viral: స్టీరింగ్‌ ఒక‌రు… గేర్ ఒక‌రు..ప్రాణాలు ప్రాణాలు గాల్లో

విధాత: లాభాపేక్షతో ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు..నష్టాల నివారణకు ప్రభుత్వ రవాణా సంస్థలు ఎవరికి వారు తమ బస్సుల మెయింటనెన్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడటం తరుచూ చూస్తుంటాం. అలాంటి సంఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన ఓ పబ్లిక్ ట్రావెల్ బస్సు లో స్టీరింగ్‌ ఒక‌రు… గేర్ ఒక‌రు ఆపరేటర్ చేస్తున్న వీడియో విపరీతంగా ట్రోల్ అవుతోంది. బస్సులో డ్రైవర్ స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తుంటే..గేర్ రాడ్ లేకపోవడంతో కండక్టర్ రోడ్డును గమనిస్తూ బస్సు స్పీడ్ ను బట్టి గేర్లు మార్చే పని నిర్వహించాడు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ బస్సు నిర్వహిస్తున్న రవాణ సంస్థకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేనట్లుగా ఉందంటూ మండిపడుతున్నారు. గేర్ రాడ్ విరగడంతోనే వారు బస్సును అలా ముందుకు తీసుకెళ్లి ఉండవచ్చని మరికొందరు నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.