AI Teacher | క్లాస్‌ రూమ్‌లో ఏఐ టీచర్‌..! విద్యార్థులను ఆకట్టుకుంటున్న ‘ఐరిష్‌’ హ్యుమనాయిడ్‌ రోబో..!

AI Teacher | ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కొత్త పుంతలు తొకుతున్నది. ఇప్పటికే పలురంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అసోంలో ఏఐ టీచర్‌ ‘ఐరిష్’ను తీసుకురాగా.. విద్యార్థులకు ఆకర్షిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలిసారిగా రూపొందిన హ్యూమనాయిడ్ రోబోగా ‘ఐరిష్‌’ రికార్డును సృష్టించింది.

AI Teacher | క్లాస్‌ రూమ్‌లో ఏఐ టీచర్‌..! విద్యార్థులను ఆకట్టుకుంటున్న ‘ఐరిష్‌’ హ్యుమనాయిడ్‌ రోబో..!

AI Teacher | ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) కొత్త పుంతలు తొకుతున్నది. ఇప్పటికే పలురంగాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా అసోంలో ఏఐ టీచర్‌ ‘ఐరిష్’ను తీసుకురాగా.. విద్యార్థులకు ఆకర్షిస్తున్నది. ఈశాన్య రాష్ట్రాల్లోనే తొలిసారిగా రూపొందిన హ్యూమనాయిడ్ రోబోగా ‘ఐరిష్‌’ రికార్డును సృష్టించింది. అన్ని రకాల ప్రశ్నలు, సందేహాలను నివృత్తి చేస్తూ అందరినీ అవాక్కు చేస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో నెట్టింట వైరల్‌గా మారింది. మేఖెలా చాదొర్ అనే అసోం సంప్రదాయ వస్త్రాధరణలో కనిపించిన హ్యూమనాయిడ్ రోబోను అసోంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్ సమకూర్చుకుంది.

తరగతి గదిలో విద్యార్థులు ఆ రోబో టీచర్‌ని ‘వాట్ ఈజ్ హిమోగ్లోబిన్’ అని ప్రశ్నించగా.. చిటికెలో పూర్తి వివరాలను తెలుపుతూ సమాధానం ఇచ్చింది. సిలబస్‌లో ఉన్న ప్రశ్నలకే కాకుండా మిగతా జనరల్‌ నాలెడ్జ్‌ ప్రశ్నలకు సైతం బదులు ఇవ్వడం గమనార్హం. కొన్నింటికి ఉదాహరణలు, రిఫరెన్స్‌లను సైతం జోడించడం విశేషం. సమాధానాలు చెప్పడంతో పాటు విద్యార్థులకు ‘ఐరిస్’ షేక్ హ్యాండ్ సైతం ఇచ్చింది. ఈ హ్యూమనాయిడ్ రోబోను చూసి విద్యార్థులంతా ముచ్చటపడ్డారు. ‘ఐరిస్’లో ఏర్పాటు చేసిన వాయిస్ కంట్రోల్డ్ అసిస్టెంట్ ద్వారా స్పందిస్తుండగా.. దీని సాయంతోనే విద్యార్థుల ప్రశ్నలకు సుదీర్ఘ వివరణ ఇస్తూ వస్తున్నది. నీతి ఆయోగ్ తీసుకొచ్చిన అటల్ టింకరింగ్ ల్యాబ్ ప్రాజెక్టు భాగస్వామ్యంతో మేకర్ ల్యాబ్స్ అనే ఎడ్యు టెక్ సంస్థ ‘ఐరిస్’ను తయారు చేసింది.

విద్యార్థుల నేర్చుకొనే అనుభవాన్ని మరింత పెంచడంలో ‘ఐరిస్’ ఒక మైలురాయి కాగలదని హ్యూమనాయిడ్ రోబోను ప్రవేశపెట్టిన స్కూల్స్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి.. 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. దేశ సంస్కృతి, చరిత్ర సృష్టించిన గొప్ప వ్యక్తుల విజయగాథలతోపాటు దేశం వివిధ రంగాల్లో సాధిస్తున్న విజయాలను ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలుపుతున్నది. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా వెబ్ సైట్ తోపాటు సోషల్ మీడియా హ్యాండిల్‌ను క్రియేట్‌ చేసింది. ‘ఎక్స్’లో అమృత్ మహోత్సవ్ పేరుతో ఉన్న హ్యాండిల్ ఇందుకు సంబంధించిన వీడియోను నెటిజన్స్‌తో పంచుకున్నది.