Low Budget Laptops | తక్కువ ధరకే ల్యాప్ ట్యాప్ లు
₹20,000 కంటే తక్కువ ధరలో బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్స్ : జియో బుక్ 4జీ, చువి హీరో బుక్, ఫుటోపియా అల్టిమస్ లభ్యమయ్యాయి.

విధాత : ల్యాప్ ట్యాప్ అంటే కనీసం రూ.50వేల నుంచి 1లక్షన్నర పెట్టాలి..అంత డబ్బు మా వద్ద లేదనుకునే వారికి తక్కువ బడ్జెట్ ల్యాప్ ట్యాప్ లు దొరికితే ఆనందమే. సాధారణంగా ఖరీదైన ల్యాప్ ట్యాప్ లు ర్యామ్ సామర్ధ్యం..ఆప్షన్స్..ప్రాసెస్ సిస్టమ్ అంతా బాగుండి ఎక్కువ కాలం వస్తాయంటారు. తక్కువ ధరవి తొందరగా పాడయ్యే అవకాశం ఉందంటారు. ఇటీవల కాలంలో రూ.20వేల లోపునే పలు కంపెనీలు తక్కువ సామర్ధ్యంతో మంచి ఫ్యూచర్లతో ల్యాప్ ట్యాప్ లు అందిస్తుండటం..కొంత ప్రయోజనకరంగా కనిపిస్తుంది. వీటిలో ప్రధానంగా జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్, చువి హీరో బుక్ ప్లస్, ఫుటోపియా అల్టిమస్ పీఆర్వో ఇంటెల్ డ్యూయల్ కోర్ ల్యాప్ ట్యాప్ లు రూ.20 వేల కంటే తక్కువకే లభిస్తున్నాయి.
జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్
జియో బుక్ 4జీ ల్యాప్‌టాప్ ధర మార్కెట్‌లో రూ.13,990గా ఉంది. దీని స్క్రీన్ పరిమాణం 11.6 అంగుళాలు ఉండగా.. ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ తో ప్రాసెసర్ వేగం 2 హెడ్జ్‌లు ఉంది. దీనికి ఆడియో స్పీకర్లు ఇవ్వడంతో పాటు 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజీ కూడా ఇచ్చారు. ఈ జియో బుక్ బ్యాటరీ జీవితం 8 గంటలు. దీని ఆపరేటింగ్ కూడా సులభమేనంటున్నారు. తక్కువ బడ్జెట్‌లో ల్యాప్ ట్యాప్ తీసుకోవాలనుకునే వారికి జీయో ల్యాప్ ట్యాప్ కొనుగోలుపై ఆలోచించవచ్చు.
చువి హీరో బుక్ ప్లస్
చువి హీరో బుక్ ప్లస్ ల్యాప్ ట్యాప్ ధర రూ.19,999గా ఉంది. విండోస్ 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది. 15.6అంగుళాల పెద్ద స్క్రీన్. హార్డ్ డిస్క్ పరిమాణం 256 జీబీగా ఉంది. దీని బ్యాటరీ కూడా 8గంటలు దీర్ఘకాలంగా ఉంటుందంటున్నారు.
ఫుటోపియా అల్టిమస్ అపెక్స్ ఇంటెల్ ల్యాప్ ట్యాప్
ఫుటోపియా అల్టిమస్ అపెక్స్ ఇంటెల్ డ్యూయల్ కోర్ ల్యాప్ ట్యాప్ మార్కెట్‌లో రూ.17,490కే లభిస్తుంది. చూడటానికి సన్నగా స్టైలిష్ గా ఉండే ఈ ల్యాప్ ట్యాప్ విండోస్ 11 హోమ్‌తో పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్., 512జీబీ స్టోరేజీ. 14.1స్క్రీన్..8 గంటల బ్యాటరీ సామర్థ్యంతో ఉండే ల్యాప్ ట్యాప్ . ఎక్కువ బడ్జెట్ పెట్టి ల్యాప్‌టాప్స్ కొనలేని వారికి ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో ఫుటోపియా అల్టిమస్ పీఆర్వో మరింత తక్కువ ధరకు వస్తుంది. ఫీచర్ల మేరకు ధరలు మారుతుంటాయి.