తెలంగాణలో కొత్తగా 578 కేసులు

విధాత‌: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్‌ వ్యాప్తి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 578 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను విడుదల చేసింది. అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో ముగ్గురు మరణించగా.. 731 మంది కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,824 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

  • Publish Date - July 19, 2021 / 04:11 AM IST