విధాత : గాంధీ భవన్ వద్ధ ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పటించుకుని ఆత్మహత్య యత్నం చేయడం కలకలం రేపింది. మక్తల్ నియోజకవర్గం చిత్తనూర్ గ్రామాన్ని కాపాలని భాస్కర్ అనే వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని గాంధీవిగ్రహం వద్ధ ఆత్మహత్య యత్నం చేశాడు.
అక్కడే ఉన్న వారు గమనించి అతడిని కిందకు లాగి అగ్గిపెట్టే లాక్కుని ఆత్మహత్య యత్నాన్ని అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతుండటంతో గ్రామస్థులు ఇబ్బంది పడనున్నారని భాస్కర్ ఆరోపించారు. ఇథనాల్ కంపనీ పెట్టకుండా కాంగ్రెస్ పోరాడాలని కోరారు.