ఈడీ, ఐటి, సీబీఐలే బీజేపీ, బీఆరెస్ స్టార్ క్యాంపెయిన‌ర్స్

  • Publish Date - November 9, 2023 / 12:10 PM IST
  • కాంగ్రెస్‌ను టార్గెట్ చేసి ఈడీ ఐటీలు
  • మోడీ, కేసీఆర్ ఢిల్లీలో దోస్తీ, గ‌ల్లీలో కుస్తి
  • బీఆరెస్‌, ఎంఐఎంల మీద ఎందుకు రైడ్స్ జ‌ర‌గ‌డం లేదు
  • రాజ‌స్థాన్‌లో లంచం అడుగుతున్న ఈడీ
  • ప్ర‌శ్నించిన ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ అజయ్


విధాత‌, హైద‌రాబాద్‌: ఐటీ ,ఈడీ, సిబిఐ సంస్థ‌లు బీజేపీ, బీఆరెస్ లకు స్టార్ కంపైనర్స్ లా వ్యవహరిస్తున్నాయ‌ని ఏఐసీసీ మీడియా కమిటీ చైర్మన్ అజయ్ ఆరోపించారు. గురువారం ఆయ‌న గాంధీభ‌వ‌న్‌లో పీసీసీ అధికార ప్ర‌తినిధి సామ రామ్మోహ‌న్‌రెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ ఈడీ, ఐటీ సంస్థ‌లు బీజేపీ అనుబంధ సంస్థలుగా పని చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ని ఎదుర్కోవడానిక్ బీజేపీ ,బీఆరెస్ లు ఎందుకు బయపడుతున్నాయన్నారు. ఈడీ, ఐటీ సంస్థ‌లు ఒక్క‌ కాంగ్రెస్ మాత్రమే టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.


మోడీ ,కేసీఆర్ ఢిల్లీ లో దోస్తి..గల్లీలో కుస్థిలా వ్యవహరిస్తున్నారన్నారు. ఐటి, ఈడీ,సీబీఐ సంస్థ‌లు బీఆరెస్‌ ,ఏంఐఎం ల మీద ఎందుకు రైడ్స్ చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు. కాళేశ్వరం లో అవినీతి జరిగిందని పిర్యాదులు వచ్చినా కేసీఆర్ , కేటీఆర్ , బీఆరెస్ నేతల మీద చర్యలు తీసుకోలేద‌న్నారు. రాజస్థాన్ లో ఈడీ కూడా లంచం అడుగుతుందన్నారు. మోడీ కనుసన్నల్లోనే ఈడీ అధికారులు సైడ్ ఇన్క‌మ్‌ సంపాదిస్తున్నారన్నారు. ఛత్తీస్ గ‌డ్ ముఖ్యమంత్రి మీద ఈడీ రైడ్స్ చేసి ప్రెస్ రిలీజ్ చేస్తుందని, కాని సాధారణంగా ఇలా చేయ‌డం జ‌ర‌గ‌ద‌న్నారు.


పారిజాత నర్సింహా రెడ్డి ,జానారెడ్డి ఇళ్లలో, లక్ష్మారెడ్డి ఇళ్లలో, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర కాంగ్రెస్ నేతలపై ఐటీ కావాల‌ని రైడ్స్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఖమ్మం లో కాంగ్రెస్ క్లీన్ స్విప్ చేస్తుందనే పొంగులేటి పై ఐటీ రైడ్స్ చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. కేసీఆర్ బయపడుతున్నాడు కాబట్టే హాట్ లైన్ లో మోడీ తో మాట్లాడి కాంగ్రెస్ నేతల మీద ఐటీ దాడులు చేయిస్తున్నాడ‌ని ఆరోపించారు. మా ఎన్నికల యుద్ధం బీజేపీ, బీఆరెస్ తో కాకుండా ఈడీ, ఐటీ తో యుద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు.


ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లో భాగంగానే ఈడీ, ఐటి, సీబీఐ దాడులు: సామా ర‌మ్మోహ‌న్‌రెడ్డి


ఎన్నికల్లో ఎత్తుగడ లో భాగంగానే కాంగ్రెస్ నేతల పై ఐటీ ,ఈడీ, సిబిఐ దాడులు చేస్తున్నాయ‌ని పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు. అవినీతి చేసిన ఎమ్మెల్యేలపై కాకుండా 10 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ నేతల పై ఐటీ దాడులు చేస్తుందన్నారు. బీజేపీ అధికారంలో ఉన్నా వారి నేతలపై ఈడీ, సిబిఐ,ఐటీ దాడులు చేయ‌డం లేద‌న్నారు. కర్ణాటక లో వెయ్యి మంది అధికారులతో దాడులు చేస్తే ఏమి కాలేద‌ని, విష‌యం అర్థం చేసుకున్న ప్ర‌జ‌లు కాంగ్రెస్ కు పట్టం కట్టారన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఈ దాడులన్నారు.


మీకు ప్రకృతి కూడా సహకరించడం లేదని తెలిపారు. మోడీ హైదరాబాద్ వచ్చి అవినీతి జరిగింది చర్యలు తీసుకున్నామన్నారు… ఏమైంది అని అడిగారు. కాళేశ్వరం ఏటి ఎం అన్నారు..మరి చర్యలు ఏవని ప్ర‌శ్నించారు. ఇప్పుడు కాళేశ్వరం కుంగి కళ్ళ ముందు కనిపిస్తున్న మోడీ దాని ప్రస్తావన కూడా చేయలేదన్నారు. బీజేపీ కావాల‌ని కాంగ్రెస్ నేతల పై చేయిస్తున్న దాడులతో ..డైరెక్ట్ గానే బీఆరెస్ మద్దతు తెలుపుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కలిసి వెళ్ళడానికే బీజేపీ ,బీఆరెస్ ముందస్తు ఒప్పందం తో పని చేస్తున్నాయని ఆయ‌న ఆరోపించారు.