విధాత : కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్‌ల పంపిణీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలలో 100మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ప్రకటించిన అభ్యర్థులందరికీ గాంధీభవన్ కేంద్రంగా ఆదివారం నుంచి బీఫామ్‌లు పంపిణీ చేపట్టారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ఉపాధ్యక్షులు నిరంజన్ తదితరులు బీఫాంల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. చాంద్రాయణగుట్ట అభ్యర్థి బోయ నగేష్, సిర్పూర్ కాగజ్‌నగర్ అభ్యర్థి రావి శ్రీనివాస్, నిర్మల్ నియోజకవర్గం నుంచి శ్రీహరి రావు తరపున ఆయన కూతురు బీ ఫామ్ లు అందుకొన్నారు.
జగిత్యాల అభ్యర్థి జీవన్ రెడ్డి తరఫున కుమారుడు, రామగుండం అభ్యర్థి మకన్ సింగ్ ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు బీఫామ్ తీసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి గదర్ కూతురు వెన్నెల, కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డిఐ కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిలు బీఫామ్‌లు స్వీకరించారు. బీఫామ్‌ల పంపిణీ ప్రారంభం సమాచారం అందుకున్న అభ్యర్థులు గాంధీభవన్‌కు వచ్చి తమ బీఫామ్‌లు తీసుకెలుతుండటంతో అభ్యర్థులు, వారి తరుపు కుటుంబ సభ్యుల రాకతో గాంధీభవన్ సందడిగా మారింది.