బండి సంజయ్‌పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే మైనంపల్లి

విధాత,హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమాంతరావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం మాట్లాడుతూ బండి సంజయ్ ఓ వెధవ.. త్వరలోనే బట్టలిప్పి రోడ్డుమీద నిల్చో పెడతా అని హెచ్చరించారు. ‘‘కేసీఆర్ నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తా’’ అని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గుండు సంజయ్‌ను బరాబర్ తిడతానని తెలిపారు. తనకు బహిరంగ క్షమాపణ చెబితే […]

బండి సంజయ్‌పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే మైనంపల్లి

విధాత,హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై నిన్న చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమాంతరావు మరోసారి స్పష్టం చేశారు. సోమవారం మాట్లాడుతూ బండి సంజయ్ ఓ వెధవ.. త్వరలోనే బట్టలిప్పి రోడ్డుమీద నిల్చో పెడతా అని హెచ్చరించారు. ‘‘కేసీఆర్ నాకు ఒక్కరోజు అవకాశం ఇస్తే బీజేపీ నేతల అంతు చూస్తా’’ అని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన గుండు సంజయ్‌ను బరాబర్ తిడతానని తెలిపారు. తనకు బహిరంగ క్షమాపణ చెబితే తప్ప నేను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తొందరలోనే బండి సంజయ్ భూముల వ్యవహారం ముందు పెడతానని తెలిపారు.మల్కాజ్‌గిరి ప్రజలు ఎవరూ ఆందోళన చెందొద్దని…అశాంతి సృష్టించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని మైనంపల్లి హనుమంతరావు ఆరోపించారు.