కేసీఆర్‌వ‌న్నీ డ్రామాలే, కేంద్ర‌మంత్రి ఫోన్ కాల్‌తో స‌హా- బండి సంజ‌య్‌

విధాత‌ల‌: అంత‌ర్ రాష్ట్ర జ‌ల వివాదాల విష‌యంలో సీఎం కేసీఆర్ వ‌న్నీ డ్రామాలేన‌ని, కేంద్ర‌మంత్రి త‌న‌కు ఫోన్ చేశార‌న్న‌ది కూడా అబ‌ద్ధ‌మ‌న్నారు బిజేపీ టీఎస్ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. సీఎం కేసీఆర్‌పై తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలైతే శ్రీశైలంలోకి దూకుతానంటూ సవాల్ చేశారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.‘‘ఈయన కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మిస్డ్ కాల్ చూసిన కేంద్రమంత్రి కాల్ బ్యాక్ చేశారు. దీనికి […]

  • Publish Date - July 6, 2021 / 09:06 AM IST

విధాత‌ల‌: అంత‌ర్ రాష్ట్ర జ‌ల వివాదాల విష‌యంలో సీఎం కేసీఆర్ వ‌న్నీ డ్రామాలేన‌ని, కేంద్ర‌మంత్రి త‌న‌కు ఫోన్ చేశార‌న్న‌ది కూడా అబ‌ద్ధ‌మ‌న్నారు బిజేపీ టీఎస్ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌. సీఎం కేసీఆర్‌పై తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలైతే శ్రీశైలంలోకి దూకుతానంటూ సవాల్ చేశారు. మంగళవారం రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘‘ఈయన కేంద్రమంత్రికి ఫోన్ చేస్తే.. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఉండి ఆయన లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత మిస్డ్ కాల్ చూసిన కేంద్రమంత్రి కాల్ బ్యాక్ చేశారు. దీనికి కేంద్రమంత్రే తనకు ఫోన్ చేశాడంటూ ప్రచారం చేసుకున్నారు. నోరు తెరిస్తే అబద్దాలు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ అన్యాయం చేశారు. దక్షిణ తెలంగాణను ఎడారి చేశారు. రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసింది మా పార్టీ. అన్యాయం చేసినోడు తెలంగాణలో బతకొద్దు. పాపం చేసినోడు వాడి పాపం వట్టిగా పోదు. ప్లాన్ ప్రకారం… ఆనాడు చంద్రబాబుతో కుమ్మక్కయ్యాడు. జగన్ రాకతో మళ్లీ అదే జరిగింది. పైకి మాత్రమే కొట్లాటలు. ప్రజలు వాస్తవాలు గ్రహించాలి. మొదటి నుంచి అన్యాయం చేస్తున్నారు’’ అంటూ కేసీఆర్‌పై బండి సంజయ్ విరుచుకుప‌డ్డారు.