విధాత:ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఎంపీలు అరవింద్, సోయం బాపూరావులతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ సరైన అనుమతుల్లేవని, అక్రమ నిర్మాణాలంటూ హైదరాబాద్ లోని కేవలం హిందువుల ఇండ్లనే జీహెచ్ఎంసీ టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
హైదరాబాద్ లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులు అభివృద్దిని కూడా మతం కోణంలో చూస్తున్నరు.మతం పేరుతో హిందువులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీలన్నీ మజ్లిస్ పార్టీకి కొమ్ముకాస్తున్నారు. అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ రెండూ ఎంఐఎం కు కొమ్ము కాసిన పార్టీలే.అధికార పార్టీ మోచేతి నీళ్లు తాగే పార్టీ ఎంఐంఎం. బిచ్చమెత్తుకునే పార్టీ. కావాలనే హిందువుల ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే పక్కా అడ్డుకుంటాం.
పాతబస్తీలో రోడ్లు ఇరుకుగా ఉన్నాయి. ఎందుకు విస్తరించడం లేదు. ఎంఐఎం అడ్డుకుంటే ఎందుకు ఆగుతున్నరు? పాతబస్తీలో కరెంట్ బిల్లు కట్టరు, ఇంటి పన్ను కట్టరు.పన్నులు కట్టే హిందువులున్న ప్రాంతాల్లో మాత్రం ఇల్లు కూల్చివేస్తున్నరు. పన్నులు కట్టడమే తప్పా? వెంటనే ఆపాలి. ఒకే పద్దతిలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలే తప్ప ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మెజారిటీ హిందువుల ఇళ్లు కూల్చేయాలనుకుంటే అడ్డుకుంటం. హైదరాబాద్ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇచ్చినా సీఎంకు బుద్ది రావడం లేదు.
వరదల సందర్భంగా ప్రజలు తిరగబడ్డరు. ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులే అక్రమించుకున్నరు. వాటిపై చర్చలు తీసుకోకుండా పేద హిందువుల ఇళ్లను కూల్చేయడం సిగ్గు చేటు.చార్మినార్, ఖైరతాబాద్….. ఈ రెండు జోన్లు తప్ప మిగితా జోన్లను జీహెచ్ఎంసీ అధికారులు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?.దమ్ముంటే ముందు చార్మినార్, ఖైరతాబాద్ జోన్లలోని అన్ని అక్రమ నిర్మాణాలను కూల్చేసి మిగితా జోన్ల వద్దకు రండి…
ఎంఐఎం కు భయపడి ఆ రెండు జోన్లలో అడుగుపెట్టలేని జీహెచ్ఎంసీ నాయకులు మిగితా జోన్లలో ఉన్న హిందువుల ఇండ్లపై పడి కూల్చేస్తారా?.ఈ పక్షఫాత ధోరణిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదు.అనుమతి లేని నిర్మాణాలను కూల్చాల్సిందే. అక్రమాలను మేం కూడా ప్రోత్సహించబోం. నోటీసుల్లేకుండా ఆకస్మిక దాడులు చేయడమేంటి? ముందు చార్మినార్ నుండి స్టార్ట్ చేయండి…. సీఎం నీచమైన పనికి దిగజారుతున్నరు. ఈటల రాజేందర్ బావమరిది మధుసూదన్ రెడ్డి పేరిట ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ పేరిట ఫేక్ ఐడీ తయారు చేసి ఇష్టానుసారంగా అసభ్య ప్రచారం చేస్తున్నారు.సీఎం గుండె మీద చేయి వేసుకుని చెప్పాలి. టీఆర్ఎస్ నిజంగా గెలిచే పరిస్థితి ఉందా? ఓడిపోతామనే భయంతోనే దిగజారుడు రాజకీయాలు చేస్తరన్నరు.
ఇలాంటి వాటిని ప్రజలు హర్షించరు. ఫేక్ ఐడీ లతో దుష్ర్పచారం చేస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఏపాటిదో అర్ధమవుతుంది.ఒకప్పుడు ఎమ్మెల్యే గెలిస్తేనే నియోజకవర్గంలో అభివ్రుద్ది జరిగేది. కానీ ఇప్పుడు రాజీనామా చేస్తేనే అభివ్రుద్ది జరుగుతోందని ప్రజలు భావిస్తున్నరు.హుజూరాబాద్ లో గెలిచేందుకు కేసీఆర్ ఆడుతున్న డ్రామాలను చూసి జనం నవ్వుకుంటున్నరు.ఆషాఢ మాసం సేల్స్ మాదిరిగా బంపర్ ఆఫర్ ల ఆశ చూపి ఇతర పార్టీల నాయకులను లోబర్చకుంటున్నరు. సిగ్గు చేటు.ఫేక్ ప్రచారం…బంపర్ ఆఫర్ లను హుజూరాబాద్ ప్రజలు అర్ధం చేసుకున్నరు. తగిన బుద్ది చెప్పేందుకు సిద్దమైండ్రు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేస్తున్నరు. ఇళ్లల్లోకి వెళ్లి మరీ అరెస్టు చేస్తున్నరు. మేం ప్రగతి భవన్ ను ముట్టడించడానికి వెళుతున్నారనే తప్పుడు సమాచారంతో పోలీసులు అరెస్టు చేస్తున్నరు.
ఎక్కడ సీఎం, కేటీఆర్ పర్యటిస్తే అక్కడ బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి 144 సెక్షన్ అమలు చేయడం సిగ్గు చేటు. బీజేపీ అంటే ఎంత భయం ఉందో అర్ధం అవుతోంది.పోలీసుల ద్వారా భయపెట్టి అరెస్టు చేసి ఏదో సాధించుకోవాలంటే అది సాధ్యం కాదనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలకు మాత్రం అనుమతి ఇవ్వరు. ధర్నా చేస్తే అరెస్టు చేస్తరు.
ధర్మపురి అరవింద్ కామెంట్స్….
రేవంత్ రెడ్డి 20 రోజుల క్రితం ధర్నా చేస్తానంటే ఇందిరా పార్క్ వద్ద అనుమతి ఇచ్చిన సీఎం బీజేపీకి ఎందుకు ఇవ్వరు? మరి కాంగ్రెస్ ను నడుపుతున్నదెవరు?.కాంగ్రెస్ ను నడుపుతున్నది కేసీఆరే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నడు. రేపు కాంగ్రెస్ టిక్కెట్లు కూడా కేసీఆరే ఇస్తడు.కాంగ్రెస్ ఫార్టీ గాంధీ భవన్ నుండి నడవడం లేదు. ప్రగతి భవన్ నుండి కేసీఆర్ నడిపిస్తుండు.రేపు ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన ధర్నా సక్సెస్ కావొద్దని 48 గంటల ముందు నుండే బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయిస్తున్నరు.ముఖ్యమంత్రి ఎన్ని కుట్రలు చేసినా రేపటి ధర్నాను విజయవంతం చేస్తాం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ధర్నాలో పాల్గొని సక్సెస్ చేయడం ఖాయం.