కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ, బీఆరెస్ కుట్రలు .. మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు

బీజేపీ‌తో చీకటి ఒప్పందం చేసుకొని బీఆరెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని మంత్రి జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి సంపాదనతో గతంలో కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడ్డారని

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ, బీఆరెస్ కుట్రలు .. మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శలు

విధాత, హైదరాబాద్ : బీజేపీ‌తో చీకటి ఒప్పందం చేసుకొని బీఆరెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని మంత్రి జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. ఆదివారం సీఎల్పీ మీడియా పాయింట్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అవినీతి సంపాదనతో గతంలో కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడ్డారని, ఆ రోజు 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆరెస్‌లో చేర్చుకున్నప్పడు బీఆరెస్ గురువింద నీతులు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి రాహుల్ గాంధీకి లేఖ రాసే అర్హత లేదన్నారు. కేసీఆర్ నిర్వాకంతో పదవులు పోయాయని గులాబీ పార్టీనేత నిరంజన్ రెడ్డి లెటర్ రాయాలన్నారు. నిరంజన్ రెడ్డి కృష్ణా నదిని కూడా ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధాన మంత్రి పదవి కాళ్లదగ్గరకు వచ్చినా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వదులుకున్నారని చెప్పారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ, బీఆరెస్‌ నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలు అంబేద్కర్ ఆయాశయాలను కాలరాస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని నిలబెట్టడం కోసమే తమ ప్రయత్నమని మంత్రిజూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. బీఆరెస్‌ , బీజేపీ నాయకులకు విలువల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. అంబేద్కర్‌, రాజ్యాంగంపై వాళ్లకు విలువలు ఉంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిందే వారు కాదా అని నిలదీశారు. గొప్ప, ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది బీఆరెస్‌ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం లో ఆరు గ్యారంటీల అమలు, ప్రజా పాలన సాగుతుందన్న భావనతోనే ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లోకి వస్తున్నారని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 16 ఎంపీ సీట్లు గెలిచి కేసీఆర్ ప్రధాని అవ్వాలని కలలు కన్నారని, ఆయనే మంచిగా పరిపాలిస్తే కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారని, ప్రజలు ఎక్కడైనా తప్పు చేస్తారా? ఇచ్చిన హామీలను కేసీఆర్ అమలు చేశారా? దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తు చేశారు. కేసీఆర్ అవకాశవాద, కుటుంబ, అవినీతి, నియంతృత్వ రాజకీయాల పట్ల విసుగత్తిన ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో సున్నా సీట్లకు పరిమితం చేశారన్నారు.