విధాత : అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బిజెపి 12 మంది అభ్యర్థులతో నాలుగవ జాబితా విడుదల చేసింది దీనితో మొత్తం 100 స్థానాలకు బిజెపి అభ్యర్థులను ప్రకటించింది. కొడంగల్ బంటు రమేష్, సిద్దిపేట దూడి శ్రీకాంత్ రెడ్డి, మిర్యాలగూడ సాదినేని శ్రీనివాస్, మునుగోడు చల్లమల్ల కృష్ణారెడ్డి, నకిరేకల్ నకిరేకంటి మొగిలయ్య, ములుగు ప్రహ్లాద నాయక్, చెన్నూరు దుర్గం అశోక్, ఎల్లారెడ్డి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, వేములవాడ తుల ఉమా, హుస్నాబాద్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, గద్వాల బోయ శివ, వికారాబాద్ పెద్దింటి నవీన్ కుమార్ లను అభ్యర్థులుగా ప్రకటించారు. తాజా జాబితాతో బిజెపి వందమంది అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.