విధాత : బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడవ జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 52మందికి, రెండో జాబితాలో ఒక అభ్యర్ధిని ప్రకటించింది. 35 మంది అభ్యర్థులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మూడో జాబితా వెల్లడించారు. సీనియర్లు ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, బాబుమోహన్, మర్రి శశిధర్‌రెడ్డిలకు మూడో జాబితాలో టికెట్లు కేటాయించారు. మిగిలిన 31 స్థానాలకు అభ్యర్థులను రేపోమాపో ప్రకటించనున్నారు. జనసేనకు కేటాయించేందుకు ప్రతిపాదించిన స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు.
మంచిర్యాల అభ్యర్థిగా వీరబెల్లి రఘునాథ్, అసిఫాబాద్( ఎస్టీ)కి అజ్మీర ఆత్మారాం నాయక్, బోధన్‌కు వద్ది మోహన్ రెడ్డి, బాన్సువాడకు ఎండల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ రూరల్ దినేష్ కులచారి, మంథనికి చందుపట్ల సునీల్ రెడ్డి, మెదక్‌కు పంజా విజయ్ కుమార్, నారాయణఖేడ్‌కు జన్వాడే సంగప్ప, ఆంధోల్(ఎస్సీ) పల్లి బాబు మోహన్, జహీరాబాద్(ఎస్సీ) రామచంద్ర రాజా నరసింహ, ఉప్పల్ కు ఎన్వీఎస్ ప్రభాకర్, ఎల్బీనగర్ సామ రంగారెడ్డి, రాజేంద్రనగర్‌కు తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల(ఎస్సీ) కేఎస్ రత్నంలను అభ్యర్థులుగా ప్రకటించారు.
పరిగికి గూనేటి మారుతీ కిరణ్, ముషీరాబాద్‌కు పూసరాజు, మలక్ పేటకు సాంరెడ్డి సురేందర్‌రెడ్డి, అంబర్‌పేట కృష్ణ యాదవ్, జూబ్లీహిల్స్ లంకల దీపక్ రెడ్డి, సనత్ నగర్ మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ మేకల సారంగపాణిలను అభ్యర్థులుగా ప్రకటించారు. నారాయణపేట్ కె. రతంగ్ పాండు రెడ్డి, జడ్చర్ల చిత్తరంజన్ దాస్, మక్తల్ జలంధర్ రెడ్డి, వనపర్తి అశ్వత్థామ రెడ్డి, అచ్చంపేట(ఎస్సీ) దేవాని సతీష్ మాదిగ, షాద్‌నగర్‌కు అందే బాబయ్య, దేవరకొండ(ఎస్టీ) కేతావత్ లాలూ నాయక్, హుజూర్ నగర్‌కు శ్రీలత రెడ్డి, నల్గొండకు మాదగోని శ్రీనివాస్ గౌడ్, ఆలేరుకు పడాల శ్రీనివాస్, పరకాలకు పి. కాళీ ప్రసాద్ రావు, పినపాక(ఎస్టీ) పోడియం బాలరాజు, పాలేరుకు నున్న రవికుమార్, సత్తుపల్లి(ఎస్సీ) రామలింగేశ్వర రావులను అభ్యర్థులుగా ప్రకటించింది.