T PCC | ఆ కుర్చీపైనే చర్చంతా..! ఆ చైర్‌నే సెంటిమెంట్‌గా భావిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్..!!
T PCC | నిజామాబాద్ జిల్లాకు చెందిన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ).. మరికాసేపట్లో టీ పీసీసీ( T PCC ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీలో అయితే బాధ్యతలు స్వీకరించారో.. అదే కుర్చీని పీసీసీ అధ్యక్ష( PCC Chief ) పదవికి కూడా ఉపయోగించాలని మహేశ్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు.
T PCC | రాజకీయ నాయకుల్లో చాలా మందికి చాలానే సెంటిమెంట్లు ఉంటాయి. ఏదైనా సెంటిమెంట్( Sentiment ) కలిసొస్తే.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో అలా సెంటిమెంట్లను ఫాలో అయ్యే రాజకీయ నాయకులను( Political Leaders ) ఎంతో మందిని చూశాం. మాజీ ముఖ్యమంత్రులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి( YS Rajashekhar Reddy ), కేసీఆర్( KCR ) కూడా సెంటిమెంట్లను ఫాలో అయ్యేవారు. మరి ముఖ్యంగా రాజకీయ జీవితం( Political Life )లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు సెంటిమెంట్లను ఫాలో అయిన వారు చాలానే ఉన్నారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ల నాయకుల జాబితాలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియామకమైన బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్( Mahesh Kumar Goud ) చేరారు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన మహేశ్ కుమార్ గౌడ్.. కాంగ్రెస్ పార్టీ( Congress Party )లో సీనియర్ నేత. రేవంత్ రెడ్డి( revanth Reddy )కి నమ్మకస్తుడు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే.. మహేశ్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సేవలందించారు. పార్టీకి, రేవంత్ రెడ్డికి ఎంతో విధేయుడిగా ఉన్న మహేశ్ కుమార్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వరించింది. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏ కుర్చీలో అయితే బాధ్యతలు స్వీకరించారో.. అదే కుర్చీని పీసీసీ అధ్యక్ష పదవికి కూడా ఉపయోగించాలని మహేశ్ కుమార్ గౌడ్ నిర్ణయించుకున్నారు.
కలిసొచ్చిన ఆ గది.. ఆ చైర్..
మొన్నటి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొనసాగిన మహేశ్ కుమార్ గౌడ్‌కు గాంధీ భవన్‌లోని మీడియా హాల్ ఎదురుగా ఉన్న గది కలిసొచ్చింది. అక్కడ ఆయన వేసుకున్న కుర్చీ కూడా తనకు పదవులు వచ్చేందుకు దోహదం చేసిందన్న భావన ఆయనలో వ్యక్తం అవుతోంది. సెంటిమెంట్ ఆధారం చేసుకుని అదే కుర్చీని పీసీసీ అధ్యక్షుడి గదిలోకి మార్చుకోనున్నారు. ఆ కుర్చీలో కూర్చొన్న తరువాతనే అసెంబ్లీ ఎన్నికలు జరగడం, పార్టీ అధికారంలోకి రావడం, ఎమ్మెల్సీ పదవి రావడం, తాజాగా పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆయన ఆ కుర్చీని సెంటిమెంట్‌గా భావిస్తున్నారు. దీంతో ఆ కుర్చీపైనే ఎక్కువగా పార్టీ కార్యకర్తల్లో చర్చ కొనసాగుతోంది. ఇక ఆ కుర్చీని పీసీసీ అధ్యక్షుడి ఛాంబర్‌లోకి మార్చాలని గాంధీ భవన్ సిబ్బందికి సూచించినట్లు సమాచారం. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించినట్లు గాంధీ భవన్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మహేశ్ కుమార్ గౌడ్ గాంధీ భవన్‌కు రానున్నారు. 2.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ఆధ్వర్యంలో మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మ. 12.30 గంటలకు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్కులో అమరవీరుల స్థూపానికి మహేశ్ కుమార్ నివాళులర్పించనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram