బీఆరెస్‌కు ఒక్క సీటు రాదు.. క‌రువుకు కార‌ణం బీఆరెస్సే

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆరెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాద‌ని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మ‌న్ సామ‌రామ్మోహ‌న్‌రెడ్డి అన్నారు

  • Publish Date - April 8, 2024 / 02:10 AM IST

లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆరెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాద‌ని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మ‌న్ సామ‌రామ్మోహ‌న్‌రెడ్డి అన్నారు

కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి

విధాత‌: లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆరెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాద‌ని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మ‌న్ సామ‌రామ్మోహ‌న్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో కనుమరుగు లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నార‌న్నారు. ఎండాకాలం కరువుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజు రోజు కు దిగజారి ఆరోపణలు చేస్తున్నార‌ని ఆరోపించారు.

కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తా అన్నారు …కానీ బీఆర్ఎస్ కక్కుర్తికి కాళేశ్వ‌రం కూలి పోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కరువు కు కారణం కాంగ్రెస్ కాదని, బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులే కారణమ‌న్నారు. గతంలో కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వలన ఇప్పుడు కరువు నుండి తెలంగాణ బయట పడుతోందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం 20ఏండ్లు వెనక్కి తెలంగాణను అప్పులకు నెట్టిందని ఆయ‌న ఆరోపించారు.

Latest News