మరో రెండు సీట్ల అభ్యర్థులను ప్రకటించిన బీఆరెస్‌

  • Publish Date - November 7, 2023 / 11:48 AM IST

విధాత : బీఆరెస్ పార్టీ మంగళవారం మరో రెండు స్థానాలకు బీఆరెస్ అభ్యర్థులను ప్రకటించిది. గోషామహల్ స్థానం బీఆరెస్‌ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్, నాంపల్లి బీఆరెస్‌ అభ్యర్థిగా సిహెచ్ ఆనంద్‌ కుమార్ గౌడ్‌లను ప్రకటించారు.


కాగా అలంపూర్ స్థానంలో ముందుగా ప్రకటించిన అబ్రహం స్థానంలో విజయుడికి పార్టీ బీఫామ్ ఇవ్వనున్నట్లుగా తెలిసింది. స్థానిక ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి కోరిక మేరకు ఇక్కడ అభ్యర్థిని మార్చాలని నిర్ణయించినట్లుగా సమాచారం.