YCP MLC Bharat | వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు.. తిరుమల సిఫారసు లేఖ విక్రయం ఆరోపణలు

కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన ఎమ్మెల్సీ భరత్‌పై పోలీసు కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట్‌

YCP MLC Bharat | వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌పై కేసు నమోదు.. తిరుమల సిఫారసు లేఖ విక్రయం ఆరోపణలు

విధాత, హైదరాబాద్ : కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన ఎమ్మెల్సీ భరత్‌పై పోలీసు కేసు నమోదైంది. తిరుమలలో తోమాల సేవ పేరిట సిఫారసు లేఖ విక్రయించినట్లు గుంటూరులోని అరండల్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు అందింది. సిఫారసు లేఖల అమ్మకంపై టీడీపీ నేత చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. గుంటూరు వాసుల నుంచి రూ.3లక్షలు వసూలు చేసినట్లు ఆరోపించారు. దీంతో ఎమ్మెల్సీ భరత్‌తో పాటు ఆయన పీఆర్వో మల్లికార్జున్‌పైన కూడా కేసు నమోదైంది. కాగా భరత్‌పై రాజకీయ కక్ష నేపథ్యంలోనే టీడీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.