ఇది ఆర్మూరు జనమా.. ప్రభంజనమా.. ఆర్మూర్‌లో ఒక విషయం అయితే తేలిపోయింది. ఈ సభ సముద్రాన్ని చూసిన తర్వాత జీనవ్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిచిపోతారని స్పష్టంగా తేలిపోయింది. జీవన్ రెడ్డి ప్రత్యేకత ఏంటంటే.. తెలంగాణ ఉద్యమంలో ఉండి.. ఎర్ర జొన్న రైతులకు కోసం ఆరమణ దీక్ష చేశారు. ఫైరింగ్ జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోలీసు కాల్పులు జరిపింది. నేను ఎక్కడ్నో కరీంనగర్ పర్యటనలో ఉన్నాను. ఇక్కడ కాల్పులు జరిగాయిని తెలిస్తే హుటాహుటిన ఆర్మూర్‌కు వచ్చాను.
అప్పట్నుంచి నాకు సన్నిహితుడై కుటుంబంలో ఓ సభ్యుడిగలా ఉండి, పార్టీని ముందుకు తీసుకుపోతున్నారు జీవన్ రెడ్డి. ఏదైనా కావాలంటే.. వెంబడి పడి సాధిస్తడు జీవన్ రెడ్డి. మండలాలు కావాలంటే అవసరమా అని ప్రశ్నించాను. జీవన్ రెడ్డి మూడు రోజులు అలిగి కూర్చుండు. అలా పట్టుదలతో, పంథాతో నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడు. అందుకే మీ అభిమానం ఇవాళ కనబడుతుంది. మీ కోసమే పని చేసే వ్యక్తి.. భారీ మెజార్టీతో గెలిపించాలి. కొందరు ఇప్పుడొచ్చి ఆపదమొక్కులు మొక్కుతారు. అవన్నీ నమ్మకండి. ప్రజల కోసం పని చేసే వ్యక్తి.. తన నియోజకవర్గం కోసం పాటు పడే వ్యక్తి జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి.
ఎన్నికలు వస్తాయి పోతాయి.. పార్టీకి ఒకరు నిలబడుతారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బరిలో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మీ అందర్నీ ప్రార్థించేది ఒక్కటే. ఇక్కడ రైతాంగం అధికంగా ఉంటది. పంటలు బ్రహ్మాండంగా పండిస్తారు. నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం. బహుషా అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేదు. అంతమంచి అభ్యుదయమైన రైతులు. అంకాపూర్ రైతుల చైతన్యంతో, వారిని స్ఫూర్తిగా తీసుకొని వందలాది గ్రామాలు ఆర్థికంగా ఎదుగుతున్నాయి.