Revanth Reddy Jubilee Hills Candidate Selection | జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్, మంత్రులతో భేటీ, ఎన్నికల కోసం పార్టీ సిద్ధం చేయాలని సూచన.

విధాత, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై చర్చించేందకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులలో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న ఆశావహులు పేర్లను సూచిస్తూ నివేదిక ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కు సూచించినట్లు సమాచారం. ఈ నెల 6న జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అభ్యర్థి ఎంపిక నిర్ణయం వెలువడనుందని సీఎం వెల్లడించినట్లుగా తెలుస్తుంది.
అలాగే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు 8 తేదీన ఇవ్వనున్న తీర్పుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ భేటీలో వారితో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకెళ్లాలని..పార్టీ కేడర్ ను ఎన్నికలకు సంసిద్దం చేయాలని సూచించినట్లుగా తెలుస్తుంది. దసరా తర్వాత బీసీ గర్జన సభ నిర్వహించాలని కూడా సూత్రప్రాయంగా నిర్ణయించినట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లుగా కథనం.